Minister KTR convoy మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు

Minister KTR convoy మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు
Minister KTR convoy

ముద్ర సిరిసిల్ల టౌన్: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రం లో ఒక ప్రయివేట్ హస్పిటల్ ప్రారంభోత్సవం లో పాల్గొని తిరిగి వస్తున్న మంత్రి కేటీఆర్ కాన్వాయ్ ని ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. పట్టణం లోని పాత బస్టాండ్ సమీపం లోని సంజీవయ్య  కమాన్ వద్ద ఒక్కసారిగా ఏబీవీపీ కార్యకర్తలు కాన్వాయ్ కి అడ్డంగా దూసుకొచ్చారు.

గ్రూప్ వన్ పేపర్ లీకేజీ విషయంలో  మంత్రి కెటిఆర్ బాధ్యత వహించి రాజీనామా చేయాలని, నిరుద్యోగులకు సరైన న్యాయం చేయాలనీ డిమాండ్ చేశారు. వెంటనే అప్రమత్తమైన పోలీస్ సిబ్బంది వారిని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తరలించారు, ఈ క్రమములో పోలీసులకు నిరసన కారులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది.