దళితబంధు పథకం ద్వారా తొలి రైస్ మిల్లు

దళితబంధు పథకం ద్వారా తొలి రైస్ మిల్లు
  • రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల లో 'విజయలక్ష్మి ఇండస్ట్రీస్' పేరుతో ఏర్పాటు
  • దళిత సాధికారతకే ‘దళిత బంధు’
  • రైస్ మిల్ పెట్టాలనే ఆలోచన చాలా గొప్పది
  • రైస్ మిల్ సక్సెస్ పుల్ గా నడవాలి
  • తెలంగాణ మొత్తానికి రైస్ మిల్ ఆదర్శం కావాలి: సిరిసిల్ల పర్యటనలో మంత్రి కేటీఆర్

ముద్ర ప్రతినిధి, రాజన్న సిరిసిల్ల: తెలంగాణ రాష్ట్రంలో దళితబంధు నిధులతో నిర్మించిన మొట్ట మొదటి రైస్ మిల్లు ను రాష్ట్ర మంత్రి కే తారక రామారావు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలం దుమాల గ్రామంలో ప్రారంభించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరకు చెందిన సుదామల్ల రాజేశ్వరి, సుదామల్ల విజయ్ కుమార్, వీర్నపల్లి మండలం రంగంపేటకు చెందిన డప్పుల లింగయ్య గ్రూపుగా కలిసి ఈ రైల్ మిల్లును నిర్మించుకున్నారు. రాజేశ్వరి భర్త సురేందర్, లింగయ్యలకు ఇప్పటికే లారీలు ఉన్నాయి. ఇక విజయ్ కుమార్ గల్ఫ్ నుంచి తిరిగొచ్చాడు. రూ.30 లక్షలకు మల్లారెడ్డిపేట మండలం దుమాల శివారులో మూడెకరాల భూమిని కొనుగోలు చేశారు. ముగ్గురికి దళితబంధు స్కీమ్ ద్వారా వచ్చిన రూ.30 లక్షలతో పాటు బ్యాంకు నుంచి లోన్ తీసుకుని రైల్ మిల్లును నిర్మించుకున్నారు. ఇటీవలే ఈ రైస్ మిల్లు నిర్మాణం పూర్తి కాగా మంత్రి ప్రారంభించారు.
ద‌ళితులు ఆర్థికంగా, అన్ని రంగాల్లో రాణించాల‌నే ఉద్దేశ్యంతో దార్శనిక సీఎం  కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు.

ద‌ళిత బంధు లబ్ధిదారులను రైస్ మిల్ యూనిట్ స్థాపన గురించి మంత్రి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ద‌ళిత సాధికార‌త‌కు ద‌ళిత బంధు ఎంతో దోహ‌దం చేస్తుంద‌న్నారు. రైస్ మిల్ యూనిట్ ను స్థాపించాలను కోవడం గొప్ప నిర్ణయం అన్నారు. ఈ యూనిట్ కు భీమా చేపించాలని లబ్దిదారులకు మంత్రి సూచించారు. యూనిట్ చాలా గొప్పగా వచ్చిందని, రైస్ మిల్ యూనిట్ సక్సెస్ పుల్ గా నడవాలని ఆకాక్షించారు. మిగతా లబ్ధిదారులకు ఇది ఆద‌ర్శంగా నిలవాలన్నారు. రాష్ట్రం మొత్తానికి రైస్ మిల్ యూనిట్ ఆదర్శం కావాలన్నారు. రైస్ మిల్లు ద్వారా తాము ఆర్ధికంగా అభివృద్ధి చెందటంతో పాటు 10 మంది ఉపాధిక కల్పించవచ్చని ఈ నిర్ణయం తీసుకున్నాం. మంత్రి  కేటీఆర్ చేతుల మీదుగా రైస్ మిల్లు ప్రారంభం కావడం ఆనందంగా ఉంది. 

మంత్రి  చెప్పినట్టు సమిష్టిగా కృషి చేసి తెలంగాణ కు ఆదర్శంగా ఈ రైస్ మిల్ ను నడిపి సిఎం కేసిఆర్, మంత్రి కే టి ఆర్ ల నమ్మకాన్ని నిలబెడుతూ కొత్తగా ఎంపిక అయ్యే లబ్ధిదారులకు సరికొత్త తోవ్వ చుపుతామన్నారు. రైస్ మిల్ యజమానుల సుధమల్ల రాజేశ్వరీ సురేందర్, సుధమల్ల విజయ్ కుమార్, డప్పుల లింగం లను అభినందించారు.