మతి తప్పి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్

మతి తప్పి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్
  • మందు పంచకుండా ఓట్లు అడుగుతా అని ప్రమాణం చేయగలవ?
  • జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రొడ్డ రామచంద్రం

ముద్ర, ఎల్లారెడ్డిపేట : మతి తప్పి మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్ అని మందు పంచకుండా ఓట్లు అడుగుతా అని గుళ్లో ప్రమాణం చేయగలవ? కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ పథకాలను ఓర్వలేక భయపడి మతిభ్రమించి నిన్నటి గంభీరావుపేట సభలో ప్రసంగించడం జరిగిందని జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్డ రామచంద్రం గురువారం పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు.

ఈ సందర్భంగా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మంత్రి కేటీఆర్ సిరిసిల్ల పట్టణము,గంభీరావుపేట మండల కేంద్రంలో మంత్రి మాట్లాడిన తీరు హాస్యాస్పదంగా ఉందన్నారు.కాంగ్రెస్ పార్టీకి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం జరుగుతుందని హెద్దేవ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆరు రకాల పథకాలతో గ్యారంటీ కార్డులను తీసుకువచ్చిందని బిఆర్ఎస్ పార్టీ జీర్ణించుకోక భయపడడం జరుగుతుందన్నారు.

దళితులకు 3 ఎకరాలు ఇస్తామని చెప్పింది వాస్తవం కాదా అని దళితున్ని ముఖ్యమంత్రి ని చేస్తానని మాట తప్పిన వైనం మీది కాదా అని ప్రశ్నించారు.నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి మాట తప్పిన ఘనత బీఆర్ఎస్ పార్టీకే చెందిందని పేర్కొన్నారు.మంత్రి కేటీఆర్ తాను ఎన్నికలలో డబ్బు ఖర్చు పెట్టనని మద్యం ఎవరికి ఇవ్వనని ప్రగల్బాలు పలకడం సత్యదూరం అన్నారు.మాట పైన మంత్రికి నిలకడ ఉంటే ఇదే మాటను ప్రమాణ పూర్తిగా తీసుకొని సిరిసిల్ల నియోజకవర్గం లో జరిగే శాసనసభ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు షేక్ గౌస్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మాటి నరసయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సద్ది లక్ష్మారెడ్డి ,ఎస్సీ సెల్ మండల శాఖ అధ్యక్షులు సూడిద రాజేందర్ పాల్గొన్నారు.