నేతన్నకు ప్రభుత్వం అండ...

నేతన్నకు ప్రభుత్వం అండ...

ముద్ర ప్రతినిధి,రాజన్న సిరిసిల్ల: నేతన్నకు బీ ఆర్ఎస్ ప్రభుత్వం అండగా నిలుస్తోందనీ సిరిసిల్ల మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి అన్నారు. మంగళవారం సిరిసిల్ల పట్టణంలో చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో నేతన్నకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి హాజరై మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత నేతన్నలు గౌరవంగా బతుకుతున్నారని,బతుకమ్మ చీరలు, విద్యార్థుల యూనిఫారాలను నేతన్నల ద్వారా తయారు చేయించి వారికి ఏడాది పొడవునా చేతినిండా పని కల్పిస్తున్నారు.అలాగే రైతు బీమా తరహాలో నేతన్న బీమా పథకాన్ని ప్రవేశపెట్టి నేత కార్మికులు సహజ మరణం పొందినా వారి కుటుంబ సభ్యులకు రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తున్నారు.

చేనేత పవర్ లూమ్ కార్మికులకు త్రిఫ్ట్ పథకం ద్వారా 10 శాతం యారన్ సబ్సిడీని నేరుగా కార్మికులకు అందిస్తున్నదని అన్నారు. ఈనెల ఏడవ తేదీన జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో పద్మశాలీల కుల బాంధవులతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించనున్న నేతన్నకు అవగాహన సదస్సు కార్యక్రమానికి సిరిసిల్ల పద్మశాలి కుల బాంధవులు,కార్మికులు అందరూ పెద్దఎత్తున హాజరై చేయాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పవర్లూమ్స్ మరియు టెక్స్టైల్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గూడూరి ప్రవీణ్ , జిల్లా అదనపు కలెక్టర్ ఖిమ్యా నాయక్ , ఆర్ డిడి అశోక్ రావు , మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్ , ఏడి సాగర్, ఏడి వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు.