మణిపూర్ లో హేయమైన ఘటనలు

మణిపూర్ లో హేయమైన ఘటనలు

 అల్ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ప్రజా సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలతో కలసి స్థానిక ప్రెస్ భవన్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబటి జోజి రెడ్డి అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. మణిపూర్ లో జరిగిన అమానవీయ ఘటనలపై జరిగిన ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ మణిపూర్ లో మైతి, కుకీ వర్గాల మధ్య రెచ్చగొట్టి మైనార్టీ వర్గాలపై జరుపుతున్న హాత్యా కాండ, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు మానవ జాతికే కళంకం తెచ్చే చర్యలని మండిపడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కలిసి పన్నిన పన్నాగంలో భాగమే అని ఆరోపించారు. తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కారు వస్తే మణిపూర్ ఘటనలు ఇక్కడ కూడా జరుగుతాయని అనుమానాలు వ్యక్తం చేశారు.

బిజెపి ఆర్ ఎస్ ఎస్ అనుబంధ సంఘాలు మైనార్టీ వర్గాలపై కుట్రపూరితంగా జరుగుతున్న అమానవీయ దాడులుగా పరిగణించాల్సి వస్తుందని అన్నారు. మణిపూర్ ఘటనపై కేంద్రం సరైన చర్యలు తీసుకోకుంటే ఐక్య పార్టీల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జమాతే ఇస్లామిక్ జిల్లా అధ్యక్షులు మహ్మద్ ఖైరుద్దీన్, సిటీ కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, విజయ్ కుమార్, సిపిఐ ఎం నుండి వాసుదేవ రెడ్డి, కే సురేందర్ రెడ్డి,జే ప్రసాద్ సిపిఐఎం ప్రజాపంతా, టిడిపి కళ్యాణపు ఆగయ్య, శ్రీనివాస్ నాయక్ ఏఐఎస్ఎఫ్, తిమోతి జయరాజ్ , డేవిడ్ రాజు, మల్లేష్ ఐ టి ఎఫ్ యు, బి విజయ్, సత్యనారాయణ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, క్రిస్టోఫర్, మార్వాడి సుదర్శన్, ఇ ఎలీషా,గాలి అనిల్ కుమార్, ముత్యాల విజయ్ కుమార్, ఎం గిడియన్ తదితరులు పాల్గొన్నారు.