నిరుపేద విద్యార్థినికి చేయూత నిచ్చిన హెల్పింగ్ హాండ్స్

నిరుపేద విద్యార్థినికి చేయూత నిచ్చిన హెల్పింగ్ హాండ్స్

ముద్ర, రాయికల్: రాయికల్ మండలంలోని వస్తాపూర్ గ్రామానికి చెందిన కొమురెల్లి సనశ్రీ తల్లిదండ్రులను కోల్పోయి ఆర్థికంగా వెనుకబడి వృద్ధాప్యంలో ఉన్న తన అమ్మమ్మ దగ్గర జీవనం కొనసాగిస్తుంది. సనశ్రీని పట్టణంలోని విస్డం హై స్కూల్ కరస్పాండెంట్ ఎద్దండి ముత్యంపు రాజు రెడ్డి చేరదీసి ఉచిత విద్యను అందిస్తున్నారు.

ఈ విషయం తెలుసుకున్న హెల్పింగ్ హాండ్స్ వారు ఒక జత యూనిఫామ్ దుస్తులు, నోటు పుస్తకాలు పెన్నులు ఇచ్చి వారి ఉదార భావాన్ని చాటారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రాజు రెడ్డి మాట్లాడుతూ నేటి యువత ఈ విధంగా సకాలంలో స్పందించి సహాయపడాలని, హెల్పింగ్ హాండ్స్ సంస్థ వారిని అభినందించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సభ్యులు సింగు నాగరాజు, పెరమండ్ల రాజశేఖర్, మానాల వెంకటేష్, బద్దం రాజేందర్, బూర్ల విజయ్, కుర్మ వినోద్ లు పాల్గొన్నారు.