రైతులకు నష్టపరిహారం అందించాలి

రైతులకు నష్టపరిహారం అందించాలి
  • కాంగ్రెస్ నాయకులు కొమిరెడ్డి కరంచంద్
  • ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా

మెట్‌పల్లి ముద్ర: ఈదురు గాలులు నువ్వు వడగండ్ల వానతో పంటలు నష్టపోయిన రైతులకు పరిహారం అందించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సుప్రీంకోర్టు అడ్వకేట్ కొమిరెడ్డి కరంచంద్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలోని ఆర్డీవో కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం కార్యాలయ ఉద్యోగికి వినతిపత్రం. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కోరుట్ల నియోజకవర్గంలో ఈదురు గాలులతో నష్టపోయిన మామిడి, వరి, నువ్వులు, మొక్కజొన్న, ఇతర పంటల రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని.

ఈ గాలుల బీభత్సం వల్ల రైతులు చెమటోడ్చి పండించిన పంటలు చేతులకు రాకపోవడంతో ఆర్థికంగా నష్టపోయారని రైతులకు పెట్టుబడి డబ్బులు కూడా మిగలడం లేదని ప్రభుత్వం వెంటనే నష్టపరిహారాన్ని అందజేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కన్వీనర్ కొమిరెడ్డి విజయ్ ఆజాద్, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు వాకిటి సత్యం రెడ్డి, షేర్ నర్సారెడ్డి, పెంట ప్రణయ్, పల్లికొండ ప్రవీణ్, ఎండి రజాక్, విజయ్ పటేల్ రైతులు ఉన్నారు.