అంజన్నను దర్శించుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ...

అంజన్నను దర్శించుకున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ...

ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ఆదివారం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాగువోత్తంరెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  ఈ సందర్బంగా ఆలయ అర్చకులు ఆయనను శేష వస్త్రoతో సత్కరించి, స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు రఘు, అర్చకులు పవన్  పాల్గొన్నారు.

 సిద్దిపేట సీపీ శ్వేత...
కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామిని ఆదివారం సిద్దిపేట కమిషనర్ అఫ్ పోలీస్ ఎన్. శ్వేత కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు.  ఈ సందర్బంగా ఆలయ అర్చకులు సీపీని శేష వస్త్రంతో సత్కరించి, స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల డీఎస్పీ ప్రకాష్, ఎస్ఐ చిరంజీవి, ఆలయ స్థానాచార్యులు కపీందర్, ఉప ప్రధాన అర్చకులు చిరంజీవి, తదితరులు పాల్గొన్నారు.