ప్రయాణికుల నీడకు యువకుడి సాయం...

ప్రయాణికుల నీడకు యువకుడి సాయం...

బస్ షెల్టర్ కు మరమ్మత్తులు చేస్తున్న యువకుడు
ముద్ర, మల్యాల: మల్యాల క్రాస్ రోడ్డు వద్ద కరీంనగర్-జగిత్యాల ప్రధాన రహదారిపై గల ఆర్టీసీ బస్ షెల్టర్ ఏళ్ల తరబడి నిరూపయోగంగా ఉండడంతో ఓ యువకుడు ముందుకు వచ్చి, వినియోగంలోకి తేవడానికి మరమ్మత్తులు చేస్తున్నాడు. రామన్నపేటకు చెందిన బొడిగే సురేష్ ( విల్లెజ్ మార్ట్ సూపర్ మార్కెట్ ఓనర్) ఎన్నో సార్లు బస్టాండ్ వినియోగంలోకి తేవడానికి ఆర్టీసీ డీఏం నుంచి ఎండీ వరకు వెళ్లాడు. వారు పట్టించుకోకపోవడంతో తానే ముందుకు వచ్చి దాదాపు 20 వేలు వెచ్చించి శనివారం మరమ్మత్తులు ప్రారంభించాడు. స్థానిక నాయకులు సైతం పట్టించుకోని సందర్బoలో యువకుడు ముందుకు రావడం పట్ల పలువురు అభినందిస్తున్నారు.

బస్టాండ్ పార్కింగ్ అడ్డా...
బస్ షెల్టర్ నిరూపయోగంగా ఉండడంతో పలువురుకి వాహనాల పార్కింగ్ గా మారింది. దీoతో ప్రయాణికులు రోడ్డుపై నిలబడి బస్సుల కోసం వేచి చూడాల్సి వస్తుంది. దీనిపై పలుమార్లు పత్రికల్లో కథనాలు రాగ, ఆర్టీసీ అధికారులు పట్టించుకోలేదు. శనివారం సురేష్ తన మిత్రుల సహాయంతో బస్టాండ్ లోని వాహనాలు తొలగించి, మరమ్మత్తులు ప్రారంభించాడు.


ఎవ్వరూ పట్టించుకోలేదు...- బొడిగే సురేష్
బస్ షెల్టర్ నిరూపయోగంపై ఆర్టీసీ డీఏం తో పాటు ఎండీ సజ్జనార్ దృష్టికి తీసుకెళ్ళాను. దాంతో అధికారులు పరిశీలించి, వెళ్లడం తప్ప వినియోగoలోకి తీసుకురాకపోవడంతో... ప్రయాణికుల ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని, నేనే ముందుకు వచ్చాను. మరమ్మత్తులు పూర్తయ్యాక ప్రయాణికులు ఉపయోగించుకునే విధంగా చూస్తాను.