తెలంగాణ అభివృద్ధికి ఉద్యమ సమయంలోనే కార్యాచరణ...

తెలంగాణ అభివృద్ధికి ఉద్యమ సమయంలోనే కార్యాచరణ...

సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
ముద్ర ప్రతినిధి, జగిత్యాల: భవిష్యత్తు తెలంగాణపై ఉద్యమ సమయంలోనే సీఎం కేసీఆర్ మేధావి వర్గంతో చర్చించి కార్యచరణ రూపొందించారని అది ఇప్పుడు అమలు చేస్తున్నారని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు భాగంగా జగిత్యాల జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో నిర్వహించిన తెలంగాణ సుపరిపాలన దినోత్సవ కార్యక్రమంలో మంత్రి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వల్లే తెలంగాణలో సుపరిపాలన సాధ్యం అవుతుందని, 75 ఏళ్ల స్వాతంత్ర్య భారత దేశ పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చారన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా సీఎం కేసీఆర్‌ తెలంగాణలో సుపరిపాలన అందిస్తున్నారు. కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలతోపాటు అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా జీవిస్తున్నారని అన్నారు. తెలంగాణ మినీ ఇండియాగా ఖ్యాతి పొందింది. అన్ని ప్రాంతాల వారు స్వేచ్ఛగా జీవిస్తున్నారు. అన్ని వర్గాల వారికి చట్టసభల్లో అవకాశం కల్పించారు. 

కుల, మతాలకు అతీతంగా ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, స్థానిక సంస్థల ప్రతినిధులు, కార్పోరేషన్ చైర్మన్లుగా అవకాశం కల్పించారు. సుస్థిర పాలన, చక్కటి శాంతి భద్రతల వల్లే  తెలంగాణ రాష్ర్టంలో అనేక పెట్టబడులు పెడుతున్నాయి, ఏ ఆశయ సాధన కోసం తెలంగాణ సాధించుకున్నామో, ఆ లక్ష్య సాధన దిశగా అడుగులు పడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. అభివృద్ధి, సంక్షేమంలో దేశానికే తెలంగాణ తలమానికంగా నిలుస్తుంది, సిఎం కెసిఆర్ విజన్ ఉన్న గోప్ప నాయకుడు కాబట్టే దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ యాస్మిన్ భాషా, ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్,జెడ్పీ చైర్ పర్సన్  దావ వసంత, ఎస్పీ భాస్కర్,అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత, మంద మకరంద్, డిసిఎం ఎస్  చైర్మెన్ శ్రీకాంత్ రెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు చీటీ వెంకట్ రావు, మున్సిపల్ చైర్మన్లు, జెడ్పీటీసీలు,ఎంపీపీలు,సర్పంచ్లు, కౌన్సిలర్లు, వివిధ శాఖల ఆధికారులు,తదితరులు పాల్గొన్నారు.