తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా మీసాల సైదులు ఎన్నిక

తెలుగుదేశం పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్య నిర్వాహక కార్యదర్శిగా మీసాల సైదులు ఎన్నిక

 హుజూర్ నగర్ టౌన్ ముద్ర తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్య నిర్వాహక కార్యదర్శిగా హుజూర్నగర్ పట్టణానికి చెందిన మీసాల సైదులును నియమిస్తూ ఆదివారం నియామక పత్రం జారీ చేశారు. ఈ మేరకు తెలంగాణ తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్, రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షులు పోలంపల్లి అశోక్ రాష్ట్ర కమిటీ ప్రకటించారు. ఈ సందర్భంగా మీసాల సైదులు మాట్లాడుతూ రెండవసారి నియమించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. పార్టీకి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.