వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? 

వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగింది? 

వివేకా హత్య జరిగిన రోజు ఏం జరిగిందో వీడియో రిలీజ్​ చేసిన ఎంపీ అవినాశ్​ రెడ్డి.  దానిలోని అంశాలు ఇలా ఉన్నాయి.... వివేకా హత్య రోజు నాకు 6.30 గంటలకు శివప్రకాశ్​ రెడ్డి కాల్​ చేశారు. జమ్మలమడుగులో వైసీపీలోకి జాయినింగ్​ కార్యక్రమానికి వెళుతున్నాను. పులివెందుల రింగ్​ రోడ్డులో ఉండగా శివప్రకాశ్​ రెడ్డి ఫోన్​ చేసి బావ ఇంటికి వెళ్లమని చెప్పారు. వివేకా ఇంటికి ఎందుకు అని అడిగాను. ‘బావ నో మోర్’​ అని శివప్రకాశ్​ రెడ్డి చెప్పారు. హుటాహుటిన వివేకా ఇంటికి వెళ్ళా. వివేకా డెడ్​బాడీ బాత్​రూమ్​లో ఉందని పీఏ కృష్ణా రెడ్డి చెప్పాడు. బెడ్​రూమ్​ నుంచి బయటకు వచ్చే సమయంలో ఏమైనా అనుమానాస్పదంగా ఉందా అని ఏపీను అడిగా. లేదని చెప్పాడు. మేం వెళ్లక ముందే జరిగిన అంశాలను ప్రజల ముందు పెడుతున్నాం. రూమ్​లో వివేకా రాసిన లేఖ, ఫోన్​ ఉన్నాయని కృష్ఱా రెడ్డి వివేకా అల్లుడు రాజశేఖర్​ కు చెప్పాడు. రాజశేఖర్​ ఆ లెటర్​ను దాచిపెట్టాలని పీఏ కృష్ణారెడ్డికి చెప్పాడు. లెటర్​, ఫోన్​ దాచిపెట్టాలని చెప్పారు. డ్యూటీకి త్వరగా రమ్మని చెప్పినందుకు నా డ్రైవర్​ చచ్చేలా కొట్టాడు. డ్రైవర్​ ప్రసాద్​ను వదిలిపెట్టవద్దని వివేకా  లెటర్​లో రాశారు.  ఈ లెటర్​ రాయడానికి చాలాకష్టపడ్డాను అని పేర్కొన్నారు.  వివేకాది హత్య  అని చెప్పడానికి లెటర్​ ముఖ్యమైన ఆధారం. లెటర్​ఎందుకు దాచిపెట్టారని సునీత, రాజశేఖర్​ని అడిగితే ప్రసాద్​ చాలా మంచివాడు, అతన్ని ఎవరైనా ఏమైనా అంటారనే లెటర్​ను దాచిపెట్టమని చెప్పామని వాళ్లు చెప్పారు. వివేకా చివరిసారి రాసిన లెటర్​లోని అంశాలు, మాటలను మీరు నమ్మరా? సునీత ఒకసారి ఒక విధంగా తరువాత మరో విధంగా సీబీఐకి స్టేట్​మెంట్​ ఇచ్చింది. ఓ సారి చెప్పిన అంశాల్లోని తప్పులను కవర్​ చేస్తూ మరో స్టేట్​మెంట్​ ఇచ్చింది. సునీతకు సీబీఐ ఎంతో స్వేచ్ఛ ఇచ్చింది. స్టేట్​మెంట్​లను మార్చుకునే స్వేచ్ఛ సీబీఐ వాళ్ళకు ఇచ్చింది. లెటర్​ ఉన్న విషయం పోలీసులు, నాకు చెప్పకపోవడం కేసులో ప్రధానమైన తప్పు. సీబీఐ విచారణాధికారి రామ్​ సింగ్​ దాన్ని  పక్కన పెట్టేలా చూశారు అని అవినాశ్​ రెడి తను రిలీజ్​ చేసిన వీడియోలో  పేర్కొన్నారు.