వ్యాపారులను బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న

వ్యాపారులను బెదిరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్న

 ఆరుగురిపై పీడీయాక్ట్​నమోదు రిమాండ్ కు తరలించిన ముషీరాబాద్​ పోలీసులు ముద్ర

ముషీరాబాద్: వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని దోపిడీలకు పాల్పడుతున్న ఆరుగురిపై ముసీరాబాద్​ పోలీసులు మంగలవారం పీడీయాక్ట్​ నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఇన్​స్పెక్టర్​ జహంగీర్​యాదవ్​ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. డబ్బున్న వారిని ఎంచుకొని అందమైన అమ్మాయిలను వారి వద్దకు పంపించి తెలివిగా వారిని బురిడీకొట్టించి అనంతరం వారిని బెదిరింపులకు గురిచేస్తూ లక్షలాది రూపాయలను దోచుకునే ముఠాను ఆరు నెలల క్రిందట అరెస్టు చేసి జైలుకు పంపించారు. కాగా ఇటీవల జైలు నుంచి విడుదలైన ముఠా సభ్యులు వికార్​మెహిదీ(34), సయ్యద్​ రఫీఖ్(30), మహ్మద్​ ఇమ్రాన్​ఖాన్​(32), షేక్​బషీర్​(31), అహ్మద్​అలీ(25), సయ్యద్​ అజ్మా ఫాతిమా(24)లు అమాయకులను, వ్యాపారులను లక్ష్యంగా చేసుకొని చెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. పలు పోలీస్​స్టేషన్​లలో వీరిపై కేసులు ఉన్నాయని, జైలుకు వెళ్ళివచ్చినా వీరిలో ఎలాంటి మార్పు రాకపోవడంతో పీడీయాక్ట్ క్రింద కేసు నమోదు చేసి రిమాండ్​కు తరలించామని ఇనస్పెక్టర్​ జహంగీర్​యాదవ్​ తెలిపారు. సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేవారెవరికైనా చట్టరీత్యా చర్యలు తప్పవని హెచ్చరించారు.