మల్యాల సీఐ గా కోటేశ్వర్ బాధ్యతలు

మల్యాల సీఐ గా కోటేశ్వర్ బాధ్యతలు

ముద్ర, మల్యాల: మల్యాల సీఐ గా బిల్ల కోటేశ్వర్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పని చేసే రమణామూర్తి ధర్మపురికి బదిలీ కాగా, అక్కడ పని చేస్తున్న కోటేశ్వర్ ను మల్యాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బాధ్యతలు స్వీకరించిన కోటేశ్వర్ ను పలువురు కలిసి శుభాకాంక్షలు తెలిపారు. రెండవ ఎస్ఐ గా కుమారస్వామి... మల్యాల పోలీస్ స్టేషన్ రెండవ ఎస్ఐ గా పెగడపల్లి ఎస్ఐ కుమారస్వామిని నియమించారు. ఈ మేరకు ఆయన మంగళవారం మల్యాల పోలీస్ స్టేషన్ లో బాధ్యతలు స్వీకరించారు.