ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానా...

ప్లాస్టిక్ కవర్లు వాడితే జరిమానా...

మెట్‌పల్లి ముద్ర:- ప్లాస్టిక్ కవర్లు వాడిన, విక్రయించిన జరిమానా విధిస్తామని మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్ గౌడ్ అన్నారు. ఆదివారం పట్టణంలోని కిరాణా దుకాణాలు, చికెన్, మటన్ సెంటర్ లపై ఆయన ఆదేశాల మేరకు మున్సిపల్ అధికారులు దాడులు నిర్వహించి ప్లాస్టిక్ కవర్ లు స్వాధీనం చేసుకొని యజమానులకు జరిమాన  విధించారు. హోటల్స్ ను నిర్వహించే యజమానులు తినుబండారాలపై కవర్స్ పెట్టలన్నారు. హోటల్స్ ను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.  ప్లాస్టిక్ కవర్స్ వాడరదన్నారు. ప్లాస్టిక్ కవర్ లు వాడినట్లయితే వెయ్యి రూపాయల నుండి 5 వేల రూపాయల వరకు జరిమాన  విధిస్తామని దుకాణాల లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఇంచార్జ్ సానిటరీ  ఇన్స్పెక్టర్ రత్నాకర్, ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ మారు విష్ణు వర్ధన్ రెడ్డి , ముజీబ్, అశోక్, నరేష్ లు ఉన్నారు.