జగిత్యాల మున్సిపల్ కు ఇంచార్జి చైర్మనే దిక్కు

జగిత్యాల మున్సిపల్ కు ఇంచార్జి చైర్మనే దిక్కు
  • మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ
  • మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా వేసిన కమీషనర్
  • విస్మయానికి గురిచేసిన అధికారుల, ప్రజాప్రతినిధుల తీరు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల : జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ కౌన్సిల్లో ఎన్నిక నిర్వహించి ఎన్నుకోవాలని ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారి చేసింది. కాని అధికారి అవగాహన రహిత్యమో, ప్రజా ప్రజా ప్రతినిధుల ఒత్తిడి కారణంగానో మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక వాయిదా వేస్తున్న ఎన్నికల కమిషన్ కు మున్సిపల్ కమిషనర్ లేఖ రాయడం చర్చనియంశం అయింది. రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు ప్రస్తుతం ఉన్న ఇంచార్జి చైర్ పర్సన్ తో కాలం వేల్లదియాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది.  జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ పదవిని బిసి మహిళకు రిజర్వు చేయగా 37వ వార్డు కౌన్సిలర్ గా గెలుపొందిన బిఆర్ ఎస్ పార్టికి చెందిన భోగ శ్రావణి చైర్ పర్సన్ గా ఎన్నికయ్యారు. రెండున్నర ఏళ్ల తర్వాత స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ కు, శ్రావణికి మద్య పరిపాలన పరమైన విబేధాలు రావడంతో చైర్ పర్సన్ పదవికి, కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేసారు. అప్పటి నుంచి వైస్ చైర్మన్ గా కోన సాగుతున్న ఓసి సామజిక వర్గానికి చెందిన గోలి శ్రీనివాస్ ను మున్సిపల్ ఇంచార్జి చైర్మన్ గా భాధ్యతలు అప్పగిస్తూ జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారి చేసారు. రాజీనామా చేసిన 3 నెలల లోపు ఎన్నికలు నిర్వహించి మరో బిసి మహిళా చైర్ పర్సన్ ను ఎన్నుకోవలసి ఉండగా పార్లమెంట్ సభ్యుడు మున్సిపల్ కౌన్సిల్ లో ఎక్స్ అఫిసియో సభ్యుడు అయినదున పార్లమెంటు సమావేశాలు ముగుసే వరకు నోటిఫికేషన్ జారి చేయలేమని ఎన్నికల కమిషన్ లేఖలో పేర్కొంది. 

జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాలని నోటిఫికేషన్ జారి చేసిన కమిషన్ 

ఖాలిగా ఉన్న జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించాలని రాష్ట్రా ఎన్నికల సంఘం అధికారి పార్థ సారధి మే 6న ఎన్నికల నోటిఫికేషన్ జారి చేశారు. ఈ నోటిఫికేషన్ ప్రకారం  మే 15న లేదా అంతకన్నా ముందుగాని, తర్వాత గాని మునిసిపల్ సమావేశం నిర్వహించి మే 19 ఉదయం 11 గంటలకు ఎన్నిక నిర్వహించి జగిత్యాల మున్సిపల్ కు నూతన చైర్ పర్సన్ ను ఎన్నుకోవాలని ఎన్నికల సంఘం జారిచేసిన నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. అయితే ఈ నోటిఫికేషన్ విషయంఫై కౌన్సిల్ సభ్యులను సమావేశ పరచలేదు ... కనీసం సభ్యులకు సమాచారం కూడా ఇవ్వలేదు. అయితే నోటిఫికేషన్ విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ కోసం పోటి పడుతున్న ఆశవాహులు సహచర కౌన్సిలర్ల మద్దతు కూడా గట్టుకునే ప్రయత్నం చేశారు. అంతిమ నిర్ణయం తీసుకునేది ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అయిన ఎమ్మెల్యే ప్రస్తావించినపుడు తమ పేరును సూచించాలని కోరారు. చైర్ పర్సన్ స్థానం బిసి మహిళా అయినందున చైర్ పర్సన్ స్థానానికి అడువాల జ్యోతి లక్ష్మణ్, సమిండ్ల వాణి శ్రీనివాస్, కొలగాని ప్రేమలత సత్యం, వల్లెపు రేణుక మొగిలిలు పోటి పడుతున్నారు. బండారు రజిని కూడా చైర్ పర్సన్ పదవిని ఆశించినప్పటికీ ఈ మద్యనే ఆమె భర్త బిఆర్ ఎస్ నాయాకుడు బండారు నరేందర్ గుండె పోటుతో మరణించగా ప్రస్తుతం ఆమె దూరం ఉండనున్నట్లు సమాచారం. చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించలేమని, జగిత్యాల మున్సిపల్ లోని 37 వార్డు కౌన్సిలర్ అయిన భోగ శ్రావణి చైర్ పర్సన్ పదవితో పాటు  కౌన్సిలర్ పదవికి రాజీనామా చేసినందున ఆ వార్డు ఎన్నిక జరిగాకే చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహిస్తామని ఎన్నికల సంఘానికి మునిసిపల్ కమిషనర్ లేఖ రాసినట్లు సమాచారం. ఈ లేఖతో అశావాహుల ఆశలు ఆడిఆశలు అయ్యాయి. వార్డుకు ఎన్నికలు జరిపేది ఎప్పుడో.. చైర్పర్సన్ ఎన్నుకునేది ఎప్పుడో అని నిట్టుర్స్తున్నారు. ఈ పరిణామాలు చూసినట్లు అయితే శాసన సభ ఎన్నికల వరకు చైర్ పర్సన్ ఎన్నిక జరిగే అవకాశమే లేదు. రూరల్, అర్బన్ ఎంపిపిల లాగా మున్సిపల్ చైర్ పర్సన్ ను కూడా ఇంచార్జిలతో కాలం వేల్లదియాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది.

  ఎన్నిక వాయిద వేషం ...

కౌన్సిల్ సభ్యురాలు ఎన్నిక జరిగాకే చైర్ పర్సన్ ఎన్నిక 
మున్సిపల్ కమిషనర్ . డా. నరేష్ 
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక జరుపాలని ఎన్నికల సంఘం నుంచి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది వాస్తవమే. కొంత సమాచారం లోపంతో ఎన్నిక వాయిద వేయాలని మరో నోటిస్ వచ్చింది. నూతన మున్సిపల్ చట్టం ప్రకారం చైర్ పర్సన్ రాజీనామా చేస్తే మరొకరిని ఎన్నుకోవచ్చు కాని కౌన్సిల్ సభ్యత్వానికి రాజీనామా చేస్తే కౌన్సిలర్ ఎన్నిక జరిగాక నూతన చైర్ పర్సన్ ఎన్నుకోవాలి. మున్సిపల్ లో ఎ వార్డు ఖాలిగా ఉన్న చైర్ పర్సన్ ఎన్నిక నిర్వహించలేం. చైర్ పర్సన్ గా వ్యవహరించిన బోగశ్రావణి తన 37 వార్డు కౌన్సిలర్ గా కూడా రాజీనామా చేశారు. ఆ వార్డు ఎన్నిక జరిగాగే చైర్ పర్సన్ ఎన్నిక జరుగుతుంది.