శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 

శివాజీ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు 

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని  టి.ఆర్.నగర్లో ఏర్పాటు చేసిన శివాజీ మహరాజ్  విగ్రహాన్ని ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి, ఎల్. రమణ, ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా  రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ డా. బోగ శ్రావణి ధ్వజారోహన చేసి కార్యక్రమాన్ని ప్రారంబించారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ కన్వీనర్ మదన్ మోహన్, బిజెపి పట్టణ అధ్యక్షులు వీరబత్తిని అనిల్ కుమార్,ఉపాధ్యక్షులు మాడిశెట్టి మల్లేశం, పవన్ సింగ్, రవితేజ, పన్నీరు నరేంద్ర, బొద్దున గజేందర్, ఆనంద్ సింగ్, హిందూ వాహిని నాయకులు వేముల సంతోష్ తదితరులు పాల్గొన్నారు.