కొండగట్టులో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం... 

కొండగట్టులో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాం... 
  • ఇకపై ఎలాంటి ఘటనలు జరక్కుండా.. చర్యలు
  • దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్


ముద్ర, మల్యాల: కొండగట్టు శ్రీ ఆంజనేయస్వామి ఆలయలో భక్తులకు అవసరమయ్యే అన్ని సౌకర్యాలు తొందర్లోనే కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ వ్యాసబట్ల అనిల్ కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన ఆకస్మికంగా కొండగట్టును సందర్శించారు. ఈ సందర్బంగా విలేకరులతో మాట్లాడుతూ సీఎం పర్యటన అనంతరం టెంపుల్ వ్యవస్థ ఎలా ఉంది, అలాగే కొండగట్టులో చేపట్టవల్సిన పనులకు సంబందించిన మాస్టర్ ప్లాన్ అమలు తీరుపై ఆలయ అధికారులు, ఇంజనీరిoగ్ విభాగంతో చర్చించినట్లు తెలిపారు. ఈఓ విన్నపం మేరకు రానున్న హనుమాన్ జయంతిలోపు పూర్తి స్థాయిలో సిబ్బందిని నియమిస్తానన్నారు. అలాగే శానిటేషన్ కోసం మ్యాన్ పవర్ పెంచుతామన్నారు. అన్ని ఆలయాల మాదిరిగా కొండగట్టులో 400 గ్రాముల లడ్డు తయారు చేయాలని సంబందిత సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ఈఈ మల్లికార్జున్ రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్  చంద్రశేఖర్, వేములవాడ ఈఈ రాజేష్, డీఈ రఘునందన్, ఈఓ వెంకటేష్, సూపరిoడేoట్ సునీల్, ఏఈ లక్ష్మణ్ రావు, చారీ, ట్రస్ట్ బోర్డు చైర్మన్ టి. మారుతి, మాజీ డైరెక్టర్ పోచమల్ల ప్రవీణ్, 
 స్వామివారి దర్శనం...


కొండగట్టును సందర్శించిన కమిషనర్ ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్బంగా ఆలయ అధికారులు, అర్చకులు ఆయనకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. అనంతరం కమిషనర్ ని అధికారులు సత్కరించగా, అర్చకులు ఆశీర్వదించి, తీర్థప్రసాదం అందజేశారు. తర్వాత కమిషనర్ ఆలయంలోని అన్నదానం సత్రం, ప్రసాదం తయారీ కేంద్రం, ఆరో వాటర్ ప్లాంట్ పనితీరు, టికెట్ కౌంటర్, తదితర విభాగాలను పరిశీలించి, సిబ్బందికి తగు సూచనలు ఇచ్చారు.


 ఇకపై ఎలాంటి ఘటనలు జరక్కుండా చర్యలు...
ఇకపై కొండగట్టులో ఎలాంటి ఘటనలు జరక్కుoడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నట్లు కమిషనర్ తెలిపారు. ఆలయoలో అలారం, భక్తుల స్కాన్ ఏర్పాటు, సీసీ కెమెరాల సంఖ్య, భద్రత సిబ్బందిని పెంచడంతో పాటు, ఆలయ సిబ్బందిలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు. మొత్తం 33 కేజీలు వెండీ ఆభరణాలు చోరీ జరిగినట్లు  విలేకరులు అడిగిన ప్రశ్నకు కమిషనర్ సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం పోలీసులు ఎంత స్వాధీనం చేసుకున్నదనేది కోర్టు నుంచి క్లయిమ్ అయ్యాక తెలుపుతామన్నారు. దర్శనం అనంతరం ఆలయంలో జరిగిన భారీ చోరీ ఘటన వివరాలు పోలీస్ శాఖ, ఆలయ సిబ్బంది ద్వారా తెలుకున్న కమిషనర్ ఆ.. ప్రదేశాలను పరిశీలించారు. ఇకపై ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ శాఖతో చర్చించారు. జిల్లా ఎస్పీ భాస్కర్ కమిషనర్ కు పలు సూచనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ ప్రకాష్, మల్యాల సీఐ రమణ మూర్తి, తదితరులు పాల్గొన్నారు.