లక్ష రూపాయల స్కీమ్ లో భాగస్వాములను చేయాలి: పద్మశాలీల డిమాండ్,ర్యాలీ, ధర్నా

లక్ష రూపాయల స్కీమ్ లో భాగస్వాములను చేయాలి: పద్మశాలీల డిమాండ్,ర్యాలీ, ధర్నా

మెట్‌పల్లి ముద్ర: ప్రభుత్వం విడుదల చేసిన బీసీలకు ఆర్థిక సాయం పథకంలో పద్మశాలీలను భాగస్వాములను చేయాలని ఇబ్రహీంపట్నం పద్మశాలీలు మెట్‌పల్లి పట్టణంలోని పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎస్సారెస్పీ కెనాల్ పై ధర్నాకు దిగారు. అక్కడి నుంచి ర్యాలీగా బయలుదేరి ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. అంతకు ముందు ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కు అందజేశారు. పద్మశాలి రాష్ట్ర సహాయ కార్యదర్శి రాపల్లి సురేష్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం  బీసీ కుల వృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందజేస్తామని ప్రకటించి అందులో పద్మశాలి వర్గాన్ని చేర్చకపోవడం బాధకరమన్నారు.కేవలం ఓటు బ్యాంకు కోసమే పద్మశాలిలను వాడుకుంటున్నారే తప్పా.. వెనుకబడిన పడిన పద్మశాలీ కులస్తులు ప్రభుత్వానికి గుర్తుకు రాలేదా అని ప్రశ్నించారు.

బీసీల కోసం ప్రవేశపెట్టిన మొదటి పథకంలోనే తమను చేర్చకపోవడన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని వెంటనే బీసీలకు లక్ష రూపాయల ఆర్థిక సాయం పథకంలో పద్మశాలీలకు అవకాశం కల్పించాలని. లేని పక్షంలో రాబోయే రోజుల్లో తమ ఓట్లతో ప్రభుత్వానికి బుద్ధి చెబుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం పద్మశాలి మండలాధ్యక్షుడు చాట్ల గణేష్, ప్రధాన కార్యదర్శి ఉడుత రాజు, జిల్లా కార్యవర్గ సభ్యుడు వేముల శ్రీహరి, చిలివేలి శ్రీనివాస్, పద్మశాలి మండల ఉపాధ్యక్షుడు నందగిరి గిరీష్, కోశాధికారి చిలివేరి శ్రీధర్, మారుతి, వినోద్, గుంటూక గంగాధర్, కంఠం రాజ్ కుమార్, ప్రవీణ్ కుమార్, తుకారాం, రవి యామాపూర్, శ్రీ వర్ధన్, గుంటూక రాజగంగారమ్, జక్కని ముకుందం, బొడ్డు మనోహర్, బింగి సురేష్, పలువురు ఉన్నారు.