దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త

దళిత వైతాళికుడుగా ప్రసిద్ధి చెందిన భాగ్యరెడ్డి వర్మ సంఘ సంస్కర్త

జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

ముద్ర ప్రతినిధి, జగిత్యాల:దళిత వైతాలికుడుగా ప్రసిద్ది చెందినా భాగ్యరెడ్డి వర్మ గొప్ప సంఘ సంస్కర్త జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష అన్నారు. సోమవారం జిల్లా సమీకృత సముదాయాల భవనంలో భాగ్య రెడ్డి వర్మ 135 వ జయంతి సందర్భంగా అదనపు కలెక్టర్లు బి.ఎస్.లత మంద మకరంద, జిల్లా అధికారులతో కలిసి  చిత్రపటానికి  పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా  కలెక్టర్ మాట్లాడుతూ   హైదరాబాదు సంస్థానంలో 26 దళిత బాలికల పాఠశాలలను స్థాపించి, వారి అభ్యున్నతికి గట్టి పునాదులు వేశాడని, జగన్మిత్రమండలి, మన్యసంఘం, సంఘసంస్కార నాటకమండలి, అహింసా సమాజంలను స్థాపించి హైదరాబాదు ప్రాంతంలో సంఘసంస్కరణలకై కృషిచేశాడని పేర్కొన్నారు.
మాదరి వెంకయ్య, రంగమాంబ దంపతులకు 1888 సంవత్సరం, మే 22వ తేదీన రెండవ సంతానంగా జన్మించిన భాగయ్య, ఆ తర్వాత కాలంలో తన పేరును భాగ్యరెడ్డిగా మార్చుకున్నాడని ఆమె తెలిపారు. భాగ్యరెడ్డి 1906లో షెడ్యూల్డు కులాల బాలబాలికలకు విద్యను నేర్పడం కోసం హైదరాబాదు లోని ఈసామియా బజారులో జగన్మిత్ర మండలిని స్థాపించాడని. భాగ్య రెడ్డి వర్మ అంటరాని కులాల ఉద్దరణకై 1911లో మన్యసంఘాన్ని ఏర్పాటుచేశాడు. అప్పటి నుండి జగన్మిత్ర మండలి యొక్క కార్యకలాపాలు మన్యసంఘం ద్వారా కొనసాగించాడని పేర్కొన్నారు. బాగయ్య చిన్నప్పటి నుంచే చరిత్ర, విజ్ఞానం పట్ల ఎంతో శ్రద్ధ కనబర్చేవాడని  వీరి ఇంటికి శైవమత గురువు తరుచూ వచ్చి బోధనలు చేసేవారని తెలిపారు.. ‘ఆర్యులు భారతదేశానికి వలస వచ్చినారు.

రెడ్డి’ అన్న పదం రేడు నుండి వచ్చిందని . దీనికి అర్ధం పాలకులు’ అని ఆయన చెప్పేవారు అని గుర్తుచేశారు.. ఇది బాగయ్య మనసులో ఎంతగా నాటుకు పోయిందంటే, ‘మా పూర్వీకులు పాలకులే కదా! నేను పాలకుడిని ఎందుకు కాకూడదు’ అని ఆయన తన పేరు చివరన రెడ్డిని చేర్చుకున్నాడని తెలిపారు.. అట్లా బాగయ్య భాగ్యరెడ్డిగా మారాడని, ఆ తరువాత 1913లో ‘ఆర్య సమాజ్’ వార్షిక సదస్సులో ఆయన సమాజానికి చేసిన సేవలకు గుర్తింపుగా ‘వర్మ’ అన్న బిరుదును ప్రధానం చేశారని . దాంతో ఆయన భాగ్యరెడ్డి వర్మగా గుర్తింపు పొందారు.భాగ్యరెడ్డి వర్మ 1939 ఫిబ్రవరి 18న క్షయ వ్యాధితో హైదరాబాదులో మరణించాడని ఈ సందర్భంగా  కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, కలెక్టరేట్ ఎఓ, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.