కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ

కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న ఎంపీ

సిద్దిపేట: ముద్ర ప్రతినిధి :దక్షిణ కాశీగా పేరుగాంచిన శ్రీ కూడవెల్లి రామలింగేశ్వర స్వామిని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్ రెడ్డి దర్శించుకున్నారు. సోమవారం నాడు ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకొని దేవాలయంలో అన్నప్రసాద కార్యక్రమం జరుగుతున్నందున ఎంపీ ఆలయానికి వచ్చి శ్రీరామలింగేశ్వర స్వామిని, శ్రీ వేణుగోపాల స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. సిద్దిపేట జిల్లా భూంపల్లి అక్బర్ పేట మండలం రామేశ్వరం పల్లి గ్రామ శివారులో కూడవెల్లి రెండు వాగులు కలిసి ప్రవహించే చోట మధ్యలో కొలువై ఉన్న శ్రీ రామలింగేశ్వర ఆలయాన్ని ఎంపీ సందర్శించారు .ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు పాలకవర్గము ఆలయ మర్యాదలతో ఎంపీ కి స్వాగతం పలికారు. స్వామివారి దర్శనం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సాకేత్ శర్మ, శ్రీనివాసశర్మలు ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ పాలకమండలి తరఫున చైర్మన్ చంద్రం, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.