సెల్ ఫోన్ పోతే సిఈఐఆర్ లో ఫిర్యాదు చేయండి

సెల్ ఫోన్ పోతే సిఈఐఆర్ లో ఫిర్యాదు చేయండి
  • ఇప్పటివరకు 36 ఫోన్ల గుర్తింపు
  • ఎస్పీ ప్రవీణ్ కుమార్

ముద్ర ప్రతినిధి, నిర్మల్: మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసి తిరిగి పొందవచ్చని నిర్మల్ ఎస్పీ ప్రవీణ్ కుమార్ వివరించారు. సోమవారం తన కార్యాలయంలో 15 మంది ఫోన్లు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ ఎవరైనా తమ సెల్ఫోన్లు పోతే బాధితులు తక్షణమే సెంట్రల్ ఎక్విప్ మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సిఇఐఆర్) లో వివరాలు నమోదు చేస్తే పోయిన సెల్ఫోన్ తిరిగి పోందే అవకాశం వుందన్నారు.  ఇప్పటి వరకు జిల్లాలోని 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 51 సెల్ఫోన్లను గుర్తించి వాటిలో 36 సెల్ఫోన్లను పోలీస్ స్టేషన్ లో యజమానులకు అందజేసినట్లు తెల్పారు.టెలికాం మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని వెబ్ లో మొబైల్ ఫోన్ పోగోట్టుకున్నారో వారు మొదట అదే నంబర్తో నూతన సిమ్ తీసుకోని, మీ సేవలో మొబైల్ లాస్ట్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీకోర్ ఇంచార్జ్ రవి కుమార్ పాటు ఐటీకోర్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు