మావోయిస్టు పార్టీ కొరియర్లు మిలీషియా సభ్యుల అరెస్ట్

మావోయిస్టు పార్టీ కొరియర్లు మిలీషియా సభ్యుల అరెస్ట్

భారీగా మందు గుండు సామాగ్రి స్వాధీనం :జిల్లా ఎస్పీ వినీత్ జి

ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం:నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన ఐదుగురు కొరియర్లు, ఐదుగురు మలేషియా సభ్యులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి భారీగా మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ వినీత్ జి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన  విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.  దుమ్మగూడెం మండలం ములకనపల్లి అటవీ ప్రాంతంలో దుమ్ముగూడెం పోలీసులు, సిఆర్పిఎఫ్ సిబ్బంది, స్పెషల్ పార్టీ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన కూంబింగ్ ఆపరేషన్ లో అనుమానాస్పదంగా తిరుగుతున్న  పది మందిని అదుపులో తీసుకొని విచారించగా వారిలో ఐదుగురు మావోయిస్టు పార్టీ కొరియర్లుగాను ఐదుగురు మిలీషియా సభ్యులుగా నిర్ధారణ అయింది అన్నారు.

వరంగల్ జిల్లా దుగ్గొండి మండలానికి చెందిన జనుకోటి, తాల్లపల్లి ఆరోగ్యం,  నర్సంపేట మండలానికి చెందిన ఆరేపల్లి శ్రీకాంత్, చెన్నారావుపేట మండలం చెందిన మేకల రాజు , చిలువేరు రమేష్ లు తో పాటు చత్తీస్గడ్ రాష్ట్రానికి చెందిన ముష్కి రమేష్, ముసుకి సురేష్ ,బాడిస లాలు , సోడి మహేష్, మడవి చేతు లను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి కార్డెక్స్ బండిల్స్, డిటోనేటర్లు ,మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరంతా నిషేధిత మావోయిస్టు పార్టీ అగ్ర నాయకుల ఆదేశానుసారం పోలీస్ క్యాంపుల పైన కూంబింగ్ కు వచ్చే పోలీసుల పైన దాడులు చేసేందుకు అవసరమైన ల్యాండ్ మైన్ లు, ఐఈడీలు, తయారు చేసేందుకు ఉపయోగించే పేలుడు పదార్థాలను మావోయిస్టులు చేరవేస్తూ పోలీసులకు చిక్కారన్నారు. మావోయిస్టులకు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని సహకరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.