సంక్షేమ పథకాలన్నీ మా వాళ్లకే

సంక్షేమ పథకాలన్నీ మా వాళ్లకే

ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు
ముద్ర ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ మా వాళ్లకే చెందుతాయి’ అని ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సంచలన ప్రకటన చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులపై శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు కోట్లాది నిధులు వెచ్చించామన్నారు. నియోజకవర్గంలో ఇల్లు లేని వారే ఉండొద్దనే ఉద్దేశంతో అందరికీ ఇళ్ల స్థలాలు అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ క్రమంలో ‘సంక్షేమ పథకాలన్నీ అన్ని వర్గాల ప్రజలకా, బీఆర్ఎస్ కార్యకర్తలకేనా?’ అని విలేకరులు ప్రశ్నించగా ఎమ్మెల్యే సమాధామిస్తూ ‘మా వారికే, మాకు అనుకూలంగా ఉన్న వారికే, బీఆర్ఎస్ కార్యకర్తలకే సంక్షేమ పథకాలు అందిస్తాం’ అని వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.