నాలుగోసారి గంగులనే గెలిపిస్తాం

నాలుగోసారి గంగులనే గెలిపిస్తాం

చిట్ ఫండ్స్ అసోసియేషన్ ఏకగ్రీవ తీర్మానం
 అసోసియేషన్ బిల్డింగుకు స్థలం, 10 లక్షలు 
 8 సంవత్సరాల్లో  గొప్పగా అభివృద్ది చేసాం
రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ ఉమ్మడి జిల్లా చిట్ఫండ్ వెల్ఫేర్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణానికి స్థలంతో పాటు 10 లక్షల రూపాయలు మంజూరు చేస్తున్నట్టు మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు.  శుక్రవారం రైస్ మిల్ అసోసియేషన్ సమావేశ మందిరంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా రిజిస్టర్డ్ చిట్ఫండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మంత్రి గంగుల కమలాకర్ నగర మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడినారు.

 ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణలో అన్ని వర్గాలను సమాన దృష్టితో చూస్తున్నామని అన్నారు. చిట్ఫండ్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని చిట్ఫండ్ అసోసియేషన్ సభ్యులు సామాజిక సేవలో కూడా ముందున్నారని వారికి ఎల్లవేళలా తన సహాయ సహకారాలు ఉంటాయని అన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 200 మంది చిట్ఫండ్ పై ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. తన గెలుపుకు నాలుగోసారి మద్దతు తెలుపుతున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రానున్న ఎన్నికల్లో  తనను ఆశీర్వదిస్తే మరింత రెట్టింపు ఉత్సాహంగా పనిచేస్తానని అన్నారు. సమైక్యాంధ్రలో కరీంనగర్ అభివృద్ధి కొంటుపడిందని తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్ రూపురేఖలు మారిపోయాయని అన్నారు. నగరంలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని నగర ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించేందుకు కృషి చేస్తామని వెల్లడించారు. 

ఈ కార్యక్రమం లో నగర మేయర్ యాదగిరి సునీల్ రావు, బారాస నగర అధ్యక్షులు చల్లారిశంకర్ చిట్ఫండ్ అసోసియేషన్ అధ్యక్షులు పెంట శ్రీనివాస్, కార్యదర్శి సత్యనారాయణ, రంజిత్ కుమార్, గౌరవ అధ్యక్షులు రాజిరెడ్డి, కొండ వేణుమూర్తి, నర్సింగరావు కోమల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు