ఆధార్ నవీకరణ పై ప్రజల్లో ఆవగాహన కల్పించాలి జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ఆధార్ నవీకరణ పై ప్రజల్లో ఆవగాహన కల్పించాలి  జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :  ఆధార్ ప్రాముఖ్యతను గురించి తెలియజేయడంతో పాటు, ఆధార్ ను నవీకరణ చేసుకోవడం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా స్థాయి మానిటరింగ్  కమిటి సమావేశంలో ఆయన పాల్గొన్నారు.   ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఆధార్ ప్రాముఖ్యతను దృష్టిలో ఉంచుకొని ఆధార్ వ్యవస్థను మరింత బలోపేతం చెసేలా జిల్లా స్థాయిలో డిపిఓలు, యంపిడిఓలు మరియు తహసీల్దార్లు ప్రజల్లో అవగాహన కల్పించాలని అన్నారు.  5 సంవత్సరాలు దాటిన పిల్లలకు బయోమెట్రిక్ మరియు ఇదివరకే ఆధార్ కార్డును పొందిన వారందరు ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి  ఆధార్ ఐడెంటిటి, అడ్రస్ ను అప్ డెట్ చేసుకునేలా చూడాలని అన్నారు.  

జిల్లాలో జనాభా ప్రాతిపదికన 100శాతం ఆదార్ నమోదు మరియు అప్ డెట్ జరిగేలా చర్యలు తీసుకోవాలని, అవసరం మేర ఆదార్ కేంద్రాలను నెలకోల్పాలని సూచించారు.   ఫిర్యాదులను స్వీకరించడానికి ప్రత్యేక ఏర్పాట్లను చేయాలని, కేంద్ర నిర్వహకులు అప్డెషన్ కొరకు వచ్చె వారినుండి అధిక వసూల్లకు పాల్పడకుండా, అనుమతి లేని కేంద్రాలు నిర్వహించకుండా క్షేత్రస్థాయిలో పర్యవెక్షించాలని అన్నారు.  వరసగా చిరునామా, పుట్టిన తేదిల మార్పులు జరిగే వాటిని గురించి పై అధికారులకు తెలియజేయాలని కేంద్ర నిర్వహకులకు సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలొ అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ చంద్రమెహన్, యుఐడిఎఐ డిప్యూటి డైరెక్టర్ రాజ్ కుమార్, ప్రాజెక్టు మెనెజర్ అనీల్, డిడబ్లుఓ సబితా కుమారి, డిఈఓ జనార్దన్ రావు, ఎల్డియం ఆంజనేయులు, డిపిఓ వీరబుచ్చయ్య, తదితర కమిటి సభ్యులు పాల్గోన్నారు.