పన్నులు చెల్లించి అభివృద్ధికి  సహకరించాలి

పన్నులు చెల్లించి అభివృద్ధికి  సహకరించాలి
  • పన్నులు చెల్లించకపోతే మరింత భారం
  •  75 శాతం మాత్రమే పన్నులు చెల్లించారు
  • ఉన్న మొండి బకాయి ధారలు పై చర్యలు తీస్కుంటాం

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : నగర ప్రజలు తమ ఆస్తి పన్నులతో పాటు నల్లా, ట్రేడ్ లైసెన్స్ పన్నులను సకాలంలో నగరపాలక సంస్థ కు చెల్లించి కరీంనగర్ నగర అభివృద్ధి కి సహాకరించాలని మేయర్ యాదగిరి సునీల్ రావు పిలుపు నిచ్చారు. 2022-2023 ఆర్థిక సంవత్సరం ఆస్తి పన్నుల చెల్లింపుల పై ప్రజలకు ఒక ప్రకటనలో ద్వారా మేయర్  విజ్ఞప్తి చేశారు. తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం లో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి గంగుల కమలాకర్ ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్ వినోద్ కుమార్ ల సహకారంతో వందల కోట్ల రూపాయల నిధులతో రోజు రోజుకు నగరం అభివృద్ధి చెందుతూ... కరీంనగర్ రూపురేఖలు మారుతున్నాయని స్పష్టం చేశారు. ఇంత సుంధరంగా తయారవుతున్న నగర అభివృద్ధి లో ప్రజలు కూడ బాగస్వాములై నగరపాలక సంస్థ చేస్తున్న అభివృద్ధి కి సహకారించాలని తెలిపారు.

2022-23 ఆర్థిక సంవత్సరం మార్చి 31 కి ముగుస్తున్నందున కేవలం 2 రోజుల గడువు మాత్రమే మిగిలి ఉన్నందున ప్రజలు తమ ఇంటి పన్నులు, నల్లా పన్నులు, వ్యాపారులు ట్రేడ్ లైసెన్స్ పన్నులను సకాలంలో చెల్లించాలని కోరారు. పన్నులు సకాలంలో చెల్లించకుండా పెండింగ్ చేయడం ద్వారా నగరపాలక సంస్థ చట్టం ప్రకారం మీ పన్నుల అపరాధ రుసుము వేయడం జరుగుతుందని తద్వారా మరింత వడ్డీ భారం పెరుగుతుందని విజ్ఞప్తి చేశారు. నగరంలో మొండి బకాయి ధారలు కూడ మీ యొక్క ఆస్తి పన్నులను రెండు రోజుల గడువు లోగా చెల్లించాలని కోరారు. గత కొన్ని సంవత్సరాలుగా పన్నులు చెల్లించాలని బకాయి ధారల పై మున్సిపల్ నూతన చట్టం ప్రకారం చర్యలు తీస్కోవడం జరుగుతుందని తెలిపారు. గత కొన్ని ఆర్థిక సంవత్సరాల నుండి నగరపాలక సంస్థ ఆస్తి పన్నుల చెల్లింపులో 90 శాతం పన్నులు కట్టిన గణత ప్రజలకే దక్కిందని ప్రస్తుతం ఈ ఆర్థిక సంవత్సరం కేవలం 75 శాతం మాత్రమే పన్నుల చెల్లింపులు జరిగాయన్నారు. ఈ నెల చివరి రోజు సాయంత్రం లోగా చెల్లించని ప్రతి ఒక్కరు తమ పన్నులు చెల్లించి నగరపాలక సంస్థ చేస్తున్న అభివృద్ధి కి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.