పాడి కౌశిక్ రెడ్డికి పాడె కట్టిన ముదిరాజులు

పాడి కౌశిక్ రెడ్డికి పాడె కట్టిన ముదిరాజులు
  • గన్నేరువరంలో కౌశిక్ రెడ్డి తీరుపై ముదిరాజుల ఆగ్రహం
  • పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం
  • ముదిరాజ్ కులస్థులను అవమానించడం పూర్తిగా ఖండిస్తున్నాం... ముదిరాజులు

గన్నేరువరం ముద్ర న్యూస్ : గన్నేరువరం మండల కేంద్రంలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను స్థానిక ముదిరాజులు తీవ్ర ఆగ్రహంతో దహనం చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే... ఇటీవల జి. ఎస్. ఆర్.  యూట్యూబ్ ఛానల్ ప్రతినిధి అజయ్ తన వృత్తిరీత్యా మీడియా కవరేజీకి వెళ్లిన సందర్భంలో అభివృద్ధిపై ప్రశ్నించిన ఓ మహిళను వీడియో తీస్తుండగా ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, అతని అనుచరులు అజయ్ పై ఆవేశంతో వెళ్లి ఫోన్ లాక్కుని, ముదిరాజ్ కులస్థులను, ఎమ్మెల్యే ఈటేల రాజేందర్ ను బూతులు తిడుతూ అసభ్యకర మాటలు మాట్లాడిన తీరుపై గన్నేరువరం మండల కేంద్రంలో వినూత్నంగా పాడి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను ఏర్పాటు చేసి, పాడె కట్టి, డప్పు చప్పులతో, బాణాసంచ పేల్చుతూ ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నుండి ఊరేగింపు చేసి కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మను చెప్పులతో కొడుతూ దహనం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గన్నేరువరం ముదిరాజ్ కులస్థులు పాల్గొన్నారు.