విజయవంతంగా కొనసాగుతున్న 'కంటి వెలుగు 2'- మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్

విజయవంతంగా కొనసాగుతున్న 'కంటి వెలుగు 2'- మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మానాయక్

చిగురుమామిడి ముద్ర న్యూస్: చిగురుమామిడి మండలంలో కంటి వెలుగు కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుందని మండల వైద్యాధికారి డాక్టర్ ధర్మా నాయక్ తెలిపారు. మంగళవారం మండలంలోని ఇందూర్తి గ్రామంలో సర్పంచ్ అందే స్వరూపతో కలిసి కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... రేకొండ గ్రామంలో కంటి వెలుగు కార్యక్రమం యధావిధిగా కొనసాగుతుందని... రేకొండ, ఇందుర్తి గ్రామ ప్రజలు కంటి వెలుగు వైద్య శిబిరాన్ని  సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మండలంలో ఇప్పటివరకు 8673 మందికి కంటి కంటి పరీక్షలు నిర్వహించగా, 2257 మందికి రీడింగ్ గ్లాసులు అందించామని తెలిపారు.  ప్రిస్క్రిప్షన్ అద్దాల కోసం ఆర్డర్ పెట్టినవి1657 కాగా ఇప్పటివరకు 993 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలను అందించామని పేర్కొన్నారు. ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో  రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రజలందరికీ  కంటి  పరీక్షలు, అద్దాలు, మందులను ఉచితంగా ఇస్తుందని  డాక్టర్ ధర్మా నాయక్ తెలిపారు.ఈ కార్యక్రమములో క్యాంప్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ నిర్మల,  ఉప సర్పంచ్ తోట సతీష్ కుమార్, వార్డ్ సభ్యులు, కోఆప్షన్ మెంబర్స్, పంచాయతీ కార్యదర్శి  వెంకట రమణ రెడ్డి, హెల్త్ సూపర్వైజర్ హేమలత, ఏఎన్ఎంలు కవిత, రజిత, అప్టి మెట్రిస్ట్ మధుమిత,  రమాదేవి, ఆశ కార్యకర్తలు తదితరులు  పాల్గొన్నారు.