భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష

భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష

కార్యకర్తలే బలం బలగం ఆత్మీయ సమ్మేళనం లో ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శ్రేణులకు దిశా నిర్దేశం

సైదాపూర్,ముద్ర:మొలంగూర్ క్రాస్ రోడ్ లో ఉన్న  విఎస్ఆర్ గార్డెన్ లో 
వె.సైదాపూర్ మండలంలోని 13 గ్రామాల బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం-2 లో పాల్గొన్న
 ఎమ్మెల్యే సతీష్ కుమార్ గారు మాట్లాడుతూ- హుస్నాబాద్ నియోజకవర్గంలో సైదాపూర్ మండలం అన్నీ రంగాల్లో అభివృద్ధి బాటలో ముందుకు సాగుతుంది, అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్న ఏకైక ప్రభుత్వం మన బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమే అని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు మిడ్ మానేరు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలతో సైదాపూర్ మండలం సస్యశ్యామలం చేసిన ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికే దక్కుతుంది, మొలంగూర్ నుండి హైదరాబాద్ వెళ్ళు డబుల్ రోడ్ నిర్మాణం,ప్రతి గ్రామాల్లో సీసీ రోడ్లు, మిషన్ భగీరథతో ఇంటి ఇంటికి నీరు అందిచడం జరుగుతుంది అని తెలిపారు.తెలంగాణ ఉద్యమం సమయంలో పోరాట స్పూర్తి నింపిన మండలం సైదాపూర్ అని గుర్తు చేశారు.

భారత రాష్ట్ర సమితి పార్టీకి కార్యకర్తలే శ్రీరామ రక్ష అని ఆత్మీయ సమ్మేళనాలు నాయకులు, కార్యకర్తల మధ్య ఆత్మీయ అనుబంధాన్ని బలోపేతం చేస్తాయన్నారు.రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు క్షేత్ర స్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేసి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపి మరింత చైతన్య పరిచేందుకు పార్టీ అధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.వచ్చే ఎన్నికల్లో బి ఆర్ ఎస్ కు హ్యాట్రిక్ విజయం,ప్రతి కార్యకర్త ప్రజలతో మమేకం కావాలి అని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.పోరాడి సాధించుకున్న తెలంగాణను దేశంలో అగ్రస్థానంలో నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయనుందని హుస్నాబాద్ ఎమ్మెల్యే శ్రీ వొడితల సతీష్ కుమార్ ధీమా వ్యక్తం, చేశారు,అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సిద్దం కావాలని,ఎప్పటికప్పుడు ప్రజలతో మమైకం కావాలని పిలుపునిచ్చారు.ప్రహుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెడుతోందని అన్నారు. అభివృద్ధితోపాటు సంక్షేమ పథకాలను పూర్తి పారదర్శకతతో అందిస్తున్నామన్నారు. కరీంనగర్ జిల్లాలో 2 లక్షల 50 వేల పార్టీ సభ్యత్వం కలిగి రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల సభ్యత్వాలు ఉన్న ఏకైక పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ మన కార్యకర్తల సంక్షేమం విషయంలో బిఆర్ఎస్ పార్టీ ఎప్పుడు అగ్ర భాగాన ఉంటుందని తెలిపారు. ప్రతి కార్యకర్తకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా అందించడంతోపాటు ఆపదలో అండగా ఉంటున్నామని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు.

బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగమని తెలిపారు. గ్రామస్థాయి నుండి ప్రభుత్వ పథకాలను ఇంటింటికి చేరవేసి మూడోసారి హ్యాట్రిక్ విజయానికి బాటలు వేయాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లాలని అందుకు కార్యకర్తలే ప్రధాన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పాల్గొన్న కరీంనగర్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శ్రీ జి.వి రామకృష్ణ రావు గారు,మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్షణ్ రావు గారు మరియు బీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.