మాజీ శాసనసభ్యులు, ఎఐసిసి సెక్రటరీ ఏ సంపత్ కుమార్

మాజీ శాసనసభ్యులు, ఎఐసిసి సెక్రటరీ ఏ సంపత్ కుమార్
  • పార్లమెంటు వ్యవస్థను అణిచి వేస్తున్న బిజెపి
  • మాజీ శాసనసభ్యులు, ఎఐసిసి సెక్రటరీ ఏ సంపత్ కుమార్

ముద్ర ప్రతినిధి కరీంనగర్ : ఆదాని కోసం ప్రధాని ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్నాడని ఏఐసీసీ కార్యదర్శి మాజీ శాసనసభ్యులు ఏ సంపత్ కుమార్ ఆరోపించారు. శుక్రవారం కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ నేతృత్వంలోని బీజేపీ కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా రాహుల్ గాంధీ ని పార్లమెంటు నుండి బహిష్కరించడాన్ని అప్రజా స్వామికం అన్నారు. తొమ్మిదేళ్ల బిజెపి పాలనలో అటు న్యాయవ్యవస్థ, ఇటు పార్లమెంటు వ్యవస్థను బీజేపీ  స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటున్నారు. రాజ్యాంగ వ్యవస్థను, న్యాయవ్యవస్థను తుంగలో తొక్కుతున్నారు అని మండిపడ్డారు.

అదానీ వ్యవహారాన్ని పార్లమెంట్ సాక్షిగా ప్రశ్నించిన రాహుల్ గాంధీ, ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖార్గే ప్రసంగాన్ని రికార్డుల నుండి తొలగించారని పేర్కొన్నారు.  మోడీకి అదానీకి మధ్య ఉన్న ఆర్థిక సంబంధాలను ఆధారాలతో సహా పార్లమెంటులో ప్రశ్నించినందుకు ఆయనపై అనర్హత వేటు వేశారని దుయ్యబడ్డారు. బిజెపి ఎన్ని కుట్రలు చేసిన కడిగిన ముత్యంలా బయటికి వస్తారని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం దేశానికి మార్గం దర్శనం చేసే నేతగా అగ్రస్థానంలో ఉంటాడని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ చొప్పదండి నియోజకవర్గం ఇంచార్జ్ మేడిపల్లి సత్యం డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ కోమటిరెడ్డి పద్మాకర్ రెడ్డి నగర కాంగ్రెస్ అధ్యక్షులు కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నాయకులు వైద్యుల అంజన్ కుమార్.

సమద్ నవాబ్ ఎండి తాజ్ పత్తి కృష్ణారెడ్డి వెన్న రాజ మల్లయ్య మడుపు మోహన్ మల్యాల సుజిత్ కుమార్ లింగంపల్లి బాబు కుర్ర పోచయ్య సయ్యద్ అఖిల్ నాగి శేఖర్ గడ్డం విలాస్ రెడ్డి కాడే శంకర్ బొబ్బిలి విక్టర్ కొరివి అరుణ్ కుమార్ పొన్నం మధు కంది తిరుపతి రెడ్డి పురుమళ్ళ మనోహర్ గుండాటి శ్రీనివాస్ రెడ్డి బాల బద్రి శంకర్ శ్యామ్ సుందర్ ఎర్ర శ్రీనివాస్ నెల్లి నరేష్ కంకణాల అనిల్ కుమార్ గుప్తా మామిడి సత్యనారాయణ రెడ్డి షబానా మహమ్మద్ జీడి రమేష్ సలీముద్దీన్ ఎస్ డి అజ్మత్ బత్తిని చంద్రయ్య గౌడ్ రాజ్ కుమార్ నదీమ్ ఆశిక్ పాషా హనీఫ్ నాగుల సతీష్ ముక్క భాస్కర్ ముల్కల కవిత పరదాల లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.