కెసిఆర్... పేదలంటే ఎందుకంత కక్ష

కెసిఆర్... పేదలంటే ఎందుకంత కక్ష
  • డబల్ బెడ్ రూమ్స్ ఇవ్వకుంటే గద్దె దిగండి
  • కలెక్టరేట్ ముందు మహాధర్నా
  • డబల్ బెడ్రూమ్స్ పోరాట సమితి కన్వీనర్  పోల్సాని సుగుణాకర్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : నిలువ నీడలేని కడు పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడంలో నిర్లక్ష్యం చేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు పేదలంటే ఎందుకంత కక్ష అని డబుల్ బెడ్ రూమ్ పోరాట సమితి కన్వీనర్ పోల్సాని సుగుణాకర్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కరీంనగర్ కలెక్టరేట్ ముందు డబుల్ బెడ్ రూమ్ బాధితులు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూమ్ పోరాట సమితి కన్వీనర్ పొల్సాని సుగుణాకర్ రావు మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ పొందటం అనేది ఇల్లు లేని పేదవారి హక్కు అని స్పష్టం చేశారు.

బాధితుల పక్షాన పోరాడితే బిఆర్ఎస్ ప్రభుత్వాన్ని అడ్డుకున్నట్లు బ్రమ పడడం సరికాదన్నారు. 2014లో ఇచ్చిన హామీని నెరవేర్చలేని అసమర్ధ పాలన రాష్ట్రంలో కొనసాగుతుందని మండిపడ్డారు. కెసిఆర్ ఇచ్చిన హామీని నెరవేర్చమంటూ వేలాది మంది బాధితులు ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ధర్నాలో పాల్గొనడం జరిగిందన్నారు. జిల్లా వ్యాప్తంగా గ్రామాలలో బిఆర్ఎస్ సర్పంచులు, వార్డ్ మెంబర్లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ధర్నాకు వచ్చే వారిని అడ్డుకునే ప్రయత్నం చేసినప్పటికీ ఇల్లు లేని పేదవారు వేల సంఖ్యలో తరలి రావడాన్ని అభినందించారు. పేదవారిని అడ్డుకోవడం కాదు వారికి ఇచ్చిన హామీని అమలు పరచాలని మండిపడ్డారు. 

ప్రజాస్వామ్య యుతంగా చేపడుతున్న నిరసన కార్యక్రమానికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు అడ్డుకోవడం సరికాదన్నారు. డబుల్ బెడ్ రూమ్ సాధించేవరకు పేదల పక్షాన నిలుస్తూ అప్పటివరకు పోరాట సమితి విశ్రమించబోదని స్పష్టం చేశారు. కెసిఆర్ తక్షణమే ఇల్లు లేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.  మహాధర్నా అనంతరం పెద్ద ఎత్తున ఆందోళనకారులు కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకపోయే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. పోలీసుల ఆందోళనకారుల మధ్య తోపులాట జరిగింది దీంతో కలెక్టరేట్ ముందు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

ఈ క్రమంలో స్వయంగా జాయింట్ కలెక్టర్  శ్యాం ప్రసాద్ లాల్  కలెక్టర్ కార్యాలయ గేటు ముందుకి వచ్చి ఇల్లు లేని పేదవారి నుండి నేరుగా దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో కన్నబోయిన ఓదెలు,  లింగంపల్లి శంకర్,  , బేతి మహేందర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, భాషవేణి మల్లేశం, దుర్గం మారుతి, అమర్నాథ్, గడ్డం నాగరాజు, మొలుగురి కిషోర్, కల్లపెళ్లి అశోక్, సోన్నాకుల శ్రీనివాస్, బాషబోయిన ప్రదీప్, కామారపు నరహరస్వామి, నగునూరి శంకర్, ఇంద్రారెడ్డి, పొన్నగంటి శంకర్, సుజాత రెడ్డి, మహేందర్ రెడ్డి,  బిజెపి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.