ముత్తిరెడ్డి కోసం కొమురవెల్లిలో మొక్కలు

ముత్తిరెడ్డి కోసం కొమురవెల్లిలో మొక్కలు

 ముద్ర ప్రతినిధి, జనగామ (చేర్యాల) : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ముచ్చటగా మూడోసారి కూడా అఖండ మెజార్టీ తో గెలవాలని బీఆర్‌‌ఎస్‌ లీడర్లు ఆకాంక్షించారు. ఈ మేరకు సోమవారం జనగామ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుంచి కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవాలయానికి బైక్ ర్యాలీగా వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు మల్లిగారి రాజు, కర్రె శ్రీనివాస్, మామిడాల రాజు, ఉడుగుల నర్సింహులు, తిప్పారాపు విజయ్, మంగ రామకృష్ణ, లెనిన్, దేవునురి సతీష్, ఇరుగు యాకన్న, వాసం యాకూబ్, కన్నారాపు ఉపేందర్, బక్క రవి, తుంగ సతీష్, మచ్చ కుమార్, బక్క లక్ష్మణ్, సందీప్ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.