ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా ఉండాలి

 రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక జనరల్‌ అబ్జర్వర్ అజయ్​ వినాయక్​

ముద్ర ప్రతినిధి, జనగామ : ఎన్నికల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని రాష్ట్ర ఎన్నికల ప్రత్యేక జనరల్‌ అబ్జర్వర్ అజయ్​ వినాయక్​ జిల్లా ఆధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన ప్రత్యేక పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రా, జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ సిహెచ్.శివలింగయ్య, జిల్లా ఎన్నికల జనరల్ అబ్జర్వర్ రవిష్ గుప్తా, పోలీస్ అబ్జర్వర్ సుజిత్ కుమార్, వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝ, డీసీపీ సీతారాం, రిటర్నింగ్ అధికారులు రోహిత్ సింగ్, మురళికృష్ణ, రామ్మూర్తితో కలిసితో కలిసి ఎన్నికల ఏర్పాట్లును పరిశీలించారు. జిల్లా ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్ రూమ్‌, వీడియో సర్వే లైన్స్ సిస్టం, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వే లైన్స్ టీమ్స్ పనితీరు, మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ సెల్, సోషల్ మీడియా మానిటరింగ్ సెల్‌ను పరిశీలించారు.

ఎన్నికలకు సంబంధించి ఫిర్యాదుల పరిష్కారానికి తీసుకున్న చర్యలను స్వయంగా ఆయన చెక్‌ చేశారు. అనంతరం ప్రధాన సమావేశ మందిరంలో జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నికల వ్యయ, జనరల్ పరిశీలన వివరాలు నోడల్ ఆఫీసర్స్ తీసుకుంటున్న చర్యలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి శివలింగయ్య, వరంగల్ సీపీ అంబర్ కిషోర్ ఝ మాట్లాడుతూ జిల్లాలో మూడు నియోజకవర్గాలు జనగామ, పాలకుర్తి, స్టేషన్ ఘనపూర్ పరిధిలో ఎన్నికల నిర్వహణ కోసం ప్రత్యేక విభాగాల నోడల్ అధికారులను నియమించి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం మానిటరింగ్‌ చేస్తున్నట్టు చెప్పారు. సమావేశంలో ఉప ఎన్నికల అధికారి సుహాసిని, ఎలక్షన్ నోడల్ ఆఫీసర్స్ సయ్యద్ ఇస్మాయిల్, వినోద్ కుమార్, ఏసీపీలు, ఎన్ఐసీ జాయింట్ డైరెక్టర్ కె.రాంప్రసాద్, ఈడీఎం దుర్గారావు, కలెక్టర్ ఏవో రవీందర్, విక్రమ్ ఎన్నికల విభాగం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.