'ఎస్ఎస్వీ'లో బతుకమ్మ వేడుకలు

'ఎస్ఎస్వీ'లో బతుకమ్మ వేడుకలు

జనగామ టౌన్,  ముద్ర :జనగామ పట్టణంలోని సూర్యాపేట రోడ్డు మిషన్ కాంపౌండ్ ఏరియాలోని శ్రీ సాయి వాణి ఒకేషనల్ జూనియర్ కాలేజీ (SSV) లో బతుకమ్మ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థినులు రంగురంగు పూలతో బతుకమ్మలు తయారుచేసి సంప్రదాయ దుస్తులు ధరించి ఆటపాటలతో సందడి చేశారు.

అనంతరం విద్యార్థినుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. శ్రీ సాయి వాణి ఒకేషనల్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ దూసరి నవీన్ గౌడ్ మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ అని భవిష్యత్తు తరాలకు బతుకమ్మ గొప్పతనం తెలిపేందుకే కళాశాలలో బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ కె.రమేష్, ఇన్చార్జి ప్రిన్సిపాల్ దేవేందర్, కళాశాల సిబ్బంది పరశురాములు,  సువర్ణ , సుస్మిత, సుహాసిని, విద్యార్థులు పాల్గొన్నారు.