అమరవీరుల సంస్మరణ, ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీలు

అమరవీరుల సంస్మరణ, ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీలు

ముద్ర ప్రతినిధి, మెదక్: అక్టోబర్ 21 నుండి పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాలు ప్రారంభం,పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా ఇంగ్లీష్, ఉర్దూ భాషలలో ఆన్లైన్ లో వ్యాసరచన పోటీల నిర్వహించనున్నట్లు ఎస్పీ  పి.రోహిణి ప్రియదర్శిని తెలిపారు. విద్యార్థిని, విద్యార్థులకు, యువతకు, ఔత్సాహిక ఫోటోగ్రాఫర్లకు, వీడియో గ్రాఫర్లకు, షార్ట్ ఫిలిమ్స్, ఫోటోగ్రఫీ పోటీలు ఉంటాయన్నారు.మెదక్ జిల్లా పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ పరిధిలలో ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల ప్రాణ త్యాగాల స్మరణలో భాగంగా అక్టోబర్ 21న పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం, పోలీస్ ఫ్లాగ్ డే సందర్బంగా సంస్మరణ కార్యక్రమాలను ఈ నెల  21 నుండి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి, జాతీయ సమైక్యత దినోత్సవం అక్టోబర్ 31 వరకు పలు  కార్యక్రమాలు నిర్వహించడం జరుగుటుందన్నారు.