గడ పనుల వేగం పెంచాలి కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

గడ పనుల వేగం పెంచాలి కలెక్టర్ రాజర్షి షా ఆదేశం

ముద్ర ప్రతినిధి, మెదక్: గడా,  స్పెషల్ డెవలప్ మెంట్  ఫండ్ క్రింద తూప్రాన్, మనోహరాబాద్ మండలాలలో చేపట్టిన వివిధ రకాల పనులలో వేగం  పెంచాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఇంజనీరింగ్ అధికారులు,  కాంట్రాక్టర్లకు సూచించారు. బుధవారం తూప్రాన్ ఆర్ అండ్ బి అతిధి గృహంలో గడా  ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డితో కలిసి తూప్రాన్, మనోహరాబాద్ మండలాలలో గడా, ఎస్.డి.ఎఫ్. క్రింద వివిధ గ్రామాలలో చేపట్టిన ఫంక్షన్ హాల్స్, డైనింగ్ హాళ్లు, శౌచాలయాలు, అదనపు తరగతి గదులు, మహిళా భవనాలు, యువజన భవనాలు, ఎస్సి కమ్యూనిటీ హాల్స్, సి.సి.డ్రైన్స్, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు,  గ్రామా పంచాయతీ భవనాలు, గ్రంధాలయ భవనాలు, అంగన్వాడీ భవనాలు, డివైడర్లు, బట్టర్ ఫ్లై లైట్లు, రోడ్డు  విస్తరణ తదితర తదితర  నిర్మాణ పనుల ప్రగతిని పని వారీగా సమీక్షించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి నియోజకవర్గంలోని ఈ మండలాలలో పనుల త్వరితగతిన పూర్తిచేయుటకు రాష్ట్ర ఆర్ధిక వైద్య ఆరోగ్య శాఖామంత్రి  హరీష్ రావు పలుమార్లు సమావేశాలు నిర్వహించారని గుర్తు చేశారు. ప్రగతిలో ముగింపు దశలో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, ఇంకా ప్రారంబించని పనులకు టెండర్లు ఆహ్వానించి వెంటనే  పనులు మొదలు పెట్టి వర్క్ షెడ్యూల్ పూర్తయ్యేలాచూడాలని  అధికారులకు సూచించారు. మంజూరు అయిన పనులకు  టెండర్లు పిలవడం ద్వారా, గ్రామ సభలో తీర్మానాల ద్వారా సర్పంచు ఆధ్వర్యంలో  పనులు చేపట్టేలా ప్రోత్సహించాలని అన్నారు. 

2014 నుండి గడా  క్రింద  తూప్రాన్ మండలంలో 29 కోట్ల 41 లక్షలతో  వివిధ అభివృద్ధి పనులు 329  చేపట్టగా 291 పనులు పూర్తయ్యాయని, మరో 23 పనులు ప్రగతిలో వివిధ దశలలో ఉన్నాయని, 15 పనులు ప్రారంభించవలసి ఉందని అన్నారు అదేవిధంగా మనోహరాబాద్ మండలాలలో  11 కోట్ల 46 లక్షల వ్యయంతో 182 పనులు చేపట్టగా 153 పనులు పూర్తయ్యాయని, 16 పనులు ప్రగతిలో ఉండగా, మరో 13 పనులు ప్రారంభించవలసి ఉందని అన్నారు అదేవిధంగా ఎస్.డి.ఎఫ్. క్రింద మనోహరాబాద్ మండలంలో 10 కోట్ల 88 లక్షల వ్యవయంతో 135 పనులు మంజూరు కాగా 133 పనులు పూర్తయ్యాయని,ఒక పని ప్రాతిలో ఉండగా, మరో ఒక పని ప్రారంభించవలసి ఉందని అన్నారు. ఇక తూప్రాన్ మండలంలో 34 కోట్ల 92 లక్షల వ్యయంతో 376  పనులు చేపట్టగా  350 పనులు పూర్తయ్యాయని, 21 పనులు ప్రగతిలో ఉండగా మరో 7 పనులు ప్రారంభించవలసి ఉందని అన్నారు. వర్షాకాలం సమీపిస్తున్నందున చివరి దశలో ఉన్న పనులు, 10 లక్షల లోపు పనులను పరుగులు పెట్టించి మే 5 నాటికి పూర్తయ్యేలా చూడాలని, మరొకొన్ని పనులు జూన్ 15 నాటికి పూర్తయ్యేలా చూడాలన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీలో గడా, ఎస్.డి.ఎఫ్. క్రింద చేపట్టిన పనుల ప్రగతిని సమీక్షిస్తూ 18 కోట్ల 37 లక్షల వ్యవయంతో మునిసిపాలిటీలోని వివిధ వార్డులలో సి.సిరోడ్లు, మురుగు కాలువలు, అండర్ గ్రౌడ్ డ్రైనేజి, ఆర్.సి.సి. పైప్ లైన్  నిర్మాణం, అప్రోత్చ్  డివైడర్, వైకుంఠ ధామం  ఆర్చి, ఫెన్సింగ్ వంటి  60 పనులు చేపట్టగా 21 పనులు పూర్తి కాగా 22 పనులు వివిధ దశలలో ప్రగతిలో ఉన్నాయని అన్నారు. కాగా మరో 17 పనులు ప్రారంభించవలసి ఉందని అన్నారు. తూప్రాన్ లో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లలో  పెండింగులో ఉన్న చిన్న  చిన్న పనులు పూర్తిచేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు . మనోహరాబాద్ లో నిర్మిస్తున్న ఫై.హెచ్.సి. కేంద్రాన్ని జూన్ 2 నాటికీ సిద్ధం చేయాలని అన్నారు. ముదిరెడ్డిపల్లిలోని టి.ఎస్.ఐ.ఐ.సి. లో ప్రజాఆయోగ అవసరాల నిమిత్తం కేటాయించిన  స్థలంలో క్రీడాప్రాంగణం, గ్రామా పంచాయతీ భవన నిర్మాణానికి చర్యలు తీసుకోవలసిందిగా అధికారులకు సూచించారు.  కాంట్రాక్టర్లు పనులు వేగవంతంగా చేసేలా పర్యవేక్షించవలసినదిగా మైన్స్ అండ్ జియాలజీ సహాయ సంచాలకుకు జయరాజ్ కు సూచించారు. అదేవిధంగా పారిశ్రామిక వేత్తలతో సి.ఎస్.ఆర్. నిధుల సమీకరణకు కృషి చేయవలసినదిగా జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తికి సూచించారు.

ఈ   సమావేశంలో జిల్లా పరిషద్ సీఈఓ వెంకట శైలేష్, పంచాయత్ రాజ్ ఈఈ సత్యనారాయణరా రెడ్డి, ఆర్ డిఓ శ్యామ్ ప్రకాష్, మిషన్ భగీరథ ఈఈ కమలాకర్, మునిసిపల్ కమీషనర్ మోహన్, తహసీల్ధార్లు, ఎంపిడిఓలు, డిప్యూటీ ఈఈలు, ఏ.ఈ.లు, కాంట్రాక్టర్లు తదితరులు పాల్గొన్నారు.