జెపీఎస్ ల సమ్మెకు చిన్న శంకరంపేట ఎంపీపీ సంఘీభావం

జెపీఎస్ ల సమ్మెకు చిన్న శంకరంపేట ఎంపీపీ సంఘీభావం

ముద్ర ప్రతినిధి, మెదక్: జూనియర్ పంచాయతీ కార్యదర్శుల నిరవధిక సమ్మెకు చిన్న శంకరంపేట ఎంపీపీ అధ్యక్షురాలు ఆవుల భాగ్యలక్ష్మి గోపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు. మెదక్ కలెక్టరెట్ గురువారం 7వరోజు
బతుకమ్మ ఆడుతూ నిరసన తెలిపారు. జిల్లా అధ్యక్షుడు కుమార్, ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ రెడ్డి, సభ్యులు నాగరాజ్, కాసిం, లిఖిత, జ్యోతి, నాగరాణి, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.