ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి దీవించండి

ప్రజా సంక్షేమ ప్రభుత్వాన్ని మరోసారి దీవించండి
  • మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:ప్రజా సంక్షేమం కోసం  దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేనన్ని పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రం హవేలీఘన్పూర్ కు చెందిన కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకులు మెదక్ ఎమ్మెల్యే సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత 60 ఏళ్ళలో జరగనిది తొమ్మిదేళ్లలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా ముందుకు వెళ్తున్న తనకు మరోసారి అవకాశం కల్పించాలని కోరారు. బీజేపీ మండల ఉపాధ్యక్షులు వడ్ల రామచందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ క్ష్మీకాంతరెడ్డి, కాంగ్రెస్ నాయకులు మోహన్ తో పాటు పలువురు బిఆర్ఎస్ లో చేరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్ పర్సన్ లావణ్య రెడ్డి, మెదక్ మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డి, మెదక్ మున్సిపల్ కౌన్సిలర్ మామిళ్ల ఆంజనేయులు, మెదక్, హవేలిగన్పూర్ మండలాల పార్టీ అధ్యక్షులు అంజాగౌడ్, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.