తండాలను పంచాయతీలుగా చేసింది కెసిఆర్

తండాలను పంచాయతీలుగా చేసింది కెసిఆర్
  • సంక్షేమానికి ప్రాధాన్యం
  • రాష్ట్ర లంబాడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు పూల్ సింగ్

ముద్ర ప్రతినిధి, మెదక్:గిరిజన తండాలను పంచాయతీలు చేసిన ఘనత సీఎం కెసిఆర్, బిఆర్ఎస్ ప్రభుత్వానిదే అని రాష్ట్ర లంబడి హక్కుల పోరాట సమితి అధ్యక్షులు పూల్ సింగ్ నాయక్ అన్నారు. శుక్రవారం  మెదక్ లోని బిఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో  విలేకరులతో మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల గిరిజన తండాలు అభివృద్ధికి  నోచుకోలేదని ఆరోపించారు. రోడ్లు, మురికి కాలువలు, తాగునీటి సమస్యలతో తండాల్లో ప్రజలు అవస్థలు పడ్డారని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్  తండాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ  ప్రత్యేక పంచాయతీలుగా ఏర్పాటు చేసినట్లు గుర్తు చేశారు. పోడు భూములకు పట్టాలిప్పించిన ఘనత  కెసిఆర్ కే దక్కిందన్నారు. ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటుతో తండాలకు మహర్దశ  వస్తుందన్నారు.

దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టలేనన్ని సంక్షేమ  పథకాలను మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచిందన్నారు. గిరిజనుల సంక్షేమానికి ప్రాధాన్యత కల్పించిన ప్రభుత్వానికి గిరిజనులంతా  అండగా నిలబడి మెదక్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని  విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు వెంకట్ బంజారా, రాష్ట్ర, జిల్లా నాయకులు రాజేందర్ నాయక్, ఏం.పూల్ సింగ్ నాయక్, వాసు నాయక్, శ్రీను నాయక్, గోపాల్ నాయక్, రోహిత్ నాయక్, శ్రీను నాయక్, భూక్య శ్రావణ్ నాయక్, రంజిత్ నాయక్, మోహన్ నాయక్, సుధీర్ నాయక్, అరుణ్ నాయక్, జగన్ నాయక్, సంగ్య నాయక్, నరేందర్, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.