కాంగ్రెస్ పార్టీని వీడిన ఎంపిటిసి, సర్పంచ్ 

కాంగ్రెస్ పార్టీని వీడిన ఎంపిటిసి, సర్పంచ్ 

తుర్కపల్లి, ముద్ర : తుర్కపల్లి మండలం ములకలపల్లి ఎంపీటీసీ ప్రతిభ రాజేష్ నాయక్, మోతీ రామ్ తండా సర్పంచ్ బిచ్చు నాయక్ తుర్కపల్లి వార్డ్ మెంబర్ ఆకుల సతీష్ కాంగ్రెస్ పార్టీని విడి శుక్రవారం  డిసిసిబి చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలను, గిరిజనుల అభివృద్ధిని చూసి పార్టీలో చేరుతున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ బిక్కు నాయక్, బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గట్టు తేజస్వి నిఖిల్, మాజీ ఎంపీపీ బబ్బూరి రవీంద్రనాథ్ గౌడ్, సేవాలాల్ నియోజకవర్గ అధ్యక్షులు భూక్య రవీందర్ నాయక్, మాజీ ఎంపిటిసి రాజయ్య, సోషల్  మీడియా నియోజకవర్గం ఇంచార్జ్  ఐలేష్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు పుల్లేల బాలరాజ్, నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.