ఇంటింటికి  కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కుంభం

ఇంటింటికి  కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్న కుంభం

వలిగొండ (ముద్ర న్యూస్): కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీ పథకాలు ప్రచారంలో భాగంగా శుక్రవారం రోజు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కుమార్ రెడ్డి శ్రీ మత్స్యగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వలిగొండ మండలంలోని  వెంకటాపురంలో జరిగిన ఇంటింటికి కాంగ్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వలిగొండ  మండలంలోని వెంకటాపురం, వేములకొండ గ్రామాల్లో గడపగడపను తిరుగుతూ  సోనియా గాంధీ  తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీ పథకాలను ప్రజలందరికి తెలియజేసారు.ఈ క్రమంలో స్థానిక మహిళలు గ్రామంలో రోడ్లు, బస్సు సర్వీసులు లేవని  బీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేయగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయిన వెంటనే ఈ పనులన్నీ పూర్తి చేస్తామని హామీ ఇవ్వగా వారు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం వెంకటేశ్వరస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రజలతో మమేకమై ముందుకు సాగుతూ వెంకటాపురం, వేములకొండ గ్రామాల్లో స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ....

గత కొన్ని సంవత్సరాల నుండి నియోజకవర్గాన్నే కుటుంబంగా భావించి నిరంతరం ప్రజలందరికి అందుబాటులో ఉంటున్నానని స్థానిక సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్నాన్నని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే ఏనాడు నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారించలేదని అన్ని రంగాల్లో భువనగిరి నియోజకవర్గాన్ని నిర్లక్ష్యం చేశారని ప్రజలకి గుర్తు చేశారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ఒకసారి అవకాశం ఇవ్వాలని రానున్న రోజుల్లో నియోజక వర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని కోరారు. అనంతరం అంబేద్కర్ విగ్రహనికి పూల మాల వేసి వివిద పార్టీల నుండి కాంగ్రెస్ లోకి చేరిన నాయకులకి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూతి రమేష్ రాజు, జడ్పిటిసి వాకిటి పద్మ అనంత రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.