చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి

చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలను జయప్రదం చేయండి
  • గుండు వెంకటనర్సు చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి

భువనగిరి ఆగస్టు 24 (ముద్ర న్యూస్):- తెలంగాణ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర, ద్వితీయ మహాసభలను సెప్టెంబర్ 4,5, తేదీలలో, పద్మశాలి భవన్, బొట్టుగూడ, నల్లగొండ, లో జరిగే చేనేత కార్మిక సంఘం రాష్ట్ర ద్వితీయ మహాసభలకు చేనేత కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని, చేనేత కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు వెంకటనర్సు కోరారు. గురువారం రోజున ఆలేరు మండల కేంద్రంలో, మహా సభలకు సంబంధించిన కరపత్రాలను  చేనేత కార్మికులతో కలసి ఆవిష్కరించడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ.... తెలంగాణ రాష్ట్రంలో చేనేత వస్త్ర పరిశ్రమ మరియు కార్మికుల సమస్యలపై గత 70 సంవత్సరాలుగా అనేక ఆందోళన కార్యక్రమాలు నిర్వహించిందని,  ప్రభుత్వాలు చేనేత పరిశ్రమను దెబ్బ తీసేందుకు, చేనేత పై జిఎస్టి, మరియు సత్యం కమిటీ సిఫారసు లను తీసుకువస్తే, వాటికి వ్యతిరేకంగా , రాష్ట్రంలో ఉన్న చేనేత కార్మిక సంఘాలను, చేనేత సహకార సంఘాలను ఐక్యం చేసి, ఉద్యమాలను నిర్వహించిందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్రంలో మొగ్గాలు లేవని, ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో, ఐక్య కార్యాచరణ ఏర్పాటు చేసి, ఉన్న  పది జిల్లాలలో, పదిరోజుల పాటు బస్సుయాత్రను నిర్వహించి, పోచంపల్లిలో  సభ నిర్వహించి, ఇందిరా పార్కు లో భారీగా మొగ్గలను ప్రదర్శించి మొగ్గాలు లేవన్న ప్రభుత్వానికి, కళ్ళు తెరిపించటం జరిగిందని, తద్వారా, ప్రభుత్వం బడ్జెట్ లో చేనేత రంగానికి 1200కోట్లు కేటాంచెలా, చేనేత మిత్ర, చేనేత కు చేయూత, ప్రకటించటంలో, చేనేత కార్మిక సంఘం కీలక పాత్ర పోషించిందని అన్నారు. చేనేత మగ్గాలకు సరిగా అందరికీ జియోట్యాగ్ వేయక పోవడం వలన చేనేత కార్మికులు, అనుబంధంగా పని చేస్తున్న, కార్మికులందరికీ ప్రభుత్వ పథకాలు అందడం లేదు. చేనేత వస్త్ర పరిశ్రమ సమస్యలను చర్చించి, భవిష్యత్ కార్యాచరణ రూపొందించటం కోసం జరిగే ఈ మహాసభలకు అధిక సంఖ్యలో చేనేత కార్మికులు పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు.ఈ కార్యక్రమంలో  అధ్యక్షులు గట్టు రాజు, కార్యదర్శి మెరుగు శ్రీదర్, కందగట్ల శ్రీనివాస్ చింతకింది గిరి ప్రసాద్, చింతకింది వేణుగోపాల్, వెంగల దాసు, కటకం లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.