తెలంగాణ సాయుధ పోరాట యోధులు సారగుండ్ల వెంకులు ఆశయ సాధనకై కృషి చేయాలి. 

తెలంగాణ సాయుధ పోరాట యోధులు సారగుండ్ల వెంకులు ఆశయ సాధనకై కృషి చేయాలి. 
  • సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-తెలంగాణ సాయుధ పోరాట యోధులు, సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు సార గుండ్ల వెంకులు ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శిమల్లు నాగార్జున రెడ్డి అన్నారు.గురువారం సిపిఎం పార్టీ వన్ టౌన్ కమిటీ ఆధ్వర్యంలో అంతటి విజయ్ ఫంక్షన్ హాల్ లో సారగుండ్ల వెంకులు సంతాప సభకు ముఖ్య అతిథిగా హాజరై  ఆయన మాట్లాడుతూ సూర్యాపేట ప్రాంతంలో జరిగినవీర తెలంగాణ సాయుధ పోరాటంలో భీమ్ రెడ్డి నరసింహారెడ్డి, మల్లు స్వరాజ్యం లతో కలిసి నాటి పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని  అన్నారు. చనిపోయేంతవరకు నీతిగా, నిజాయితీగా  జీవించారని అన్నారు. అనేక ఆటుపోట్లు వచ్చినప్పటికీ చివరి వరకు సిపిఎం పార్టీలో కొనసాగుతూ సూర్యాపేట పట్టణంలో సిపిఎం పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని అన్నారు. నాడు కాంగ్రెస్ ప్రభుత్వంహయాంలోఎన్నో ఇబ్బందులు పెట్టినప్పటికీమొక్కవోని ధైర్యంతో కృష్ణ టాకీస్ ఏరియాలో సిపిఎం పార్టీని అగ్ర భాగాన నడపడంలో సార గుండ్ల వెంకులు చేసిన కృషి మరువలేనిదని ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టి పెళ్లి సైదులు, సిపిఎం పార్టీ వన్ టౌన్ కార్యదర్శి ఎల్గూరి గోవింద్, సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జిల్లపల్లి నరసింహారావు,వేల్పుల వెంకన్న, వీరబోయిన రవి, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎం రాంబాబు, సిపిఎం నాయకులు వల్లపు దాసు సాయికుమార్, చెరుకు సత్యం,  అర్వపల్లి లింగయ్య,  మామిడి పుల్లయ్య,శశిరేఖ, గండమల్ల  భాగ్యమ్మ,పిట్టల రాణి,ఎల్లమ్మ, బిక్షావమ్మ,  నాయకులు బోళ్ల సోమిరెడ్డి, సారగుండ్ల మాణిక్యమ్మ,కిషన్,రాజు,తదితరులు పాల్గొన్నారు.