సామాన్యుడు కూడా రాజు కాగలడని నిరూపించిన "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్"

సామాన్యుడు కూడా రాజు కాగలడని నిరూపించిన "సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్"
  • పల్లగొర్ల మోదీరాందేవ్ యాదవ్ 

భువనగిరి ఆగస్టు 18 (ముద్ర న్యూస్):- భువనగిరి ఖిలా వద్ద ఉన్న సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహానికి 373జయంతిని పురస్కరించుకొని పూల దండేసి నినాదాలు ఇచ్చిన విద్యార్థులు బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పల్లగొర్ల మోదీరాందేవ్ వారు మాట్లాడుతూ దున్నేవాడిదే భూమి గీసే వాడిదే చెట్టు అంశాలను ఆనాడే అమలుపరిచిన గొప్ప రాజు వరంగల్ జిల్లా ఔషాపూర్ లో 1650 ఆగస్ట్ 18 న జన్మించిన సర్వాయి పాపన్న గౌడ్ సాధారణమైన గీత కార్మికుడు. నిజాం పోలీస్ ఒకానొక ఘటనలో తన మిత్రుణ్ణి చంపినందున అగ్రహోదగ్రుడై 25 మంది నిజాం పోలీసులను  ఎదుర్కొని మట్టుబెట్టాడు. 5000 వేలమంది ప్రజలకు ఆయుధ శిక్షణను ఇచ్చి అతితక్కువ కాలంలో వరంగల్, గోల్కొండ లాంటి 25 కోట దుర్గాలను జయించి ఒకరకంగా ప్రస్తుత తెలంగాణ ప్రాంతాన్ని 25 సంవత్సరాల పాటు పరిపాలించాడు.

మొఘల్ చిట్టచివరి రాజు మహమ్మద్ షా ఎన్ని బెదిరింపులు చేసినా లొంగలేదు., గ్రామ కమిటీల ద్వారా ప్రజలే పరిపాలించుకునే ప్రజాస్వామ్యాన్ని 350 సంవత్సరాల క్రితమే తెలంగాణలో తెచ్చాడు. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ శౌర్య ప్రతాపాలను, పరిపాలనా దక్షతను చూసిన మొఘల్ చక్రవర్తులు పాపన్న గౌడ్ తో కొన్నాళ్ళు రాజీ కుదుర్చుకున్నారు. దీనిని సహించని తెలంగాణ ప్రాంతంలోని జమీందార్ జాగీర్దార్లు మొఘల్ రాజును సర్దార్ పాపన్న పై ఉసిగొలిపి యుధ్ధంలో ఓడింపచేసి, తల నరికించి గోల్కొండ ప్రధాన ద్వారానికి నెల రోజులు కట్టించారు. ప్రపంచ చరిత్రలోనే ఒక సామాన్యుడు రాజై 25 ఏళ్ళు అత్యంత ప్రజాస్వామికంగా పరిపాలించిన దాఖలాలు అంతకు ముందు ఎక్కడా లేవు. అంత గొప్ప బహుజన రాజు అయిన పాపన్న ధన్యజీవి. పేదలకు, సామాన్యులకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జీవితం అత్యంత స్ఫూర్తిదాయకం అన్నారు, ఈ సమావేశంలో కోట నాని,  నూకల శ్రీధర్, ఎండి షాదుల్లా, టి శ్రవణ్, కోట అభిషేక్, నవీన్ గౌడ్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు.