అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

అత్యధిక మెజారిటీతో గెలిపించాలి

భూదాన్ పోచంపల్లి, ముద్ర;రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పైళ్ల శేఖర్ రెడ్డి సతీమణి పైళ్ళ వనిత శేఖర్ రెడ్డి అన్నారు .బుధవారం భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని కప్రాయిపల్లి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ ఇంటింటి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిఆర్ఎస్ తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని ,రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న సంక్షేమ పథకాలు చేస్తున్న అభివృద్ధి పనులు దేశంలోనే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు. సంక్షేమ పథకాల కొనసాగింపు కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను హైట్రిక్ సీఎంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని గుర్తు చేశారు .ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ పాక వెంకటేష్ యాదవ్, గ్రామ సర్పంచ్ గోడల ప్రభాకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.