ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కొనసాగించేందుకు గొంగిడి సునీతను గెలిపించాలి..

ముఖ్యమంత్రిగా కేసీఆర్ ను కొనసాగించేందుకు గొంగిడి సునీతను గెలిపించాలి..

బొమ్మలరామారం (ముద్ర న్యూస్): రాష్ట్ర ముఖ్యమంత్రిగా గత రెండు పర్యాయాలు ప్రజల మద్దతుతో ఎన్నికై రాష్ట్రాన్ని దేశానికే ఆదర్శంగా నిలిపిన ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనను కొనసాగించేందుకు ఆలేరు నియోజకవర్గం నుండి గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరుతూ బుధవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలంలోని మర్యాల గ్రామంలో బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సుధాగాని హరి శంకర్ గౌడ్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిగా కేసీఆర్ పాలన కొనసాగాలని అన్నారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమ పథకాలు నిరంతరం ప్రజలకు అందించేందుకు ప్రజలు కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాగినేనిపల్లి గ్రామ సర్పంచ్ బట్కూరి బీరప్ప తో పాటు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. పార్టీ నాయకులు. కార్యకర్తలు. తదితరులు పాల్గొన్నారు....