కేర్చుపల్లిలో బొడ్రాయి నాభి శంకుస్థాపన

కేర్చుపల్లిలో బొడ్రాయి నాభి శంకుస్థాపన

వలిగొండ, ముద్ర న్యూస్: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని కేర్చుపల్లి గ్రామంలో నూతనంగా నెలకొల్పుతున్న బొడ్రాయి నాభి శంకుస్థాపన పూజా కార్యక్రమం గురువారం జరిగింది. గ్రామ అభివృద్ధి సూచన మేరకు గ్రామ సర్పంచి మద్దెల మంజుల నాగరాజు గణపతి పూజా కార్యక్రమం  నిర్వహించినారు. బొడ్రాయి నాభి పూజ కార్యక్రమాలు నిర్వహించినారు. కేర్చుపల్లి గ్రామానికి చెందిన కందడి చంద్రా రెడ్డి కుమారుడు పారిశ్రామికవేత్త కందడి ప్రభాకర్ రెడ్డి, రజిత దంపతులు పూజ కార్యక్రమాలలో పాల్గొన్నారు. బొడ్రాయి నాభికి అయ్యే ఖర్చులు మొత్తం ఇస్తానని దాతగా ముందుకు వచ్చిన వారి కుటుంబ సభ్యులను గ్రామ సర్పంచి మద్దెల మంజుల నాగరాజు మరియు గ్రామ ప్రజలు అభినందించినారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వెంకటేష్ కో ఆప్షన్ నెంబర్ బర్మా జంగయ్య, గ్రామ పెద్దలు కందడి సుదర్శన్ రెడ్డి, దయాకర్ రెడ్డి, గ్రామ సెక్రెటరీ స్వప్న, దయ్యాల చిన్న అంజయ్య, అమరేందర్ పాల్గొన్నారు.