కాంగ్రెస్ పార్టీ వస్తే గోర్లు మింగేటోడిపోయి బర్లు మింగేటోడు వస్తడు

కాంగ్రెస్ పార్టీ వస్తే గోర్లు మింగేటోడిపోయి బర్లు మింగేటోడు వస్తడు
  • తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ -బిఆర్ ఎస్ లకు ఓటు బ్యాంక్ మాత్రమే 
  • కాంగ్రెస్ పార్టీలో ఏడూ నియోజకవర్గాల్లో ఒక్క బిసి అభ్యర్థి లేడు 
  • బీసీలను గొంతు కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ...
  • బంగారు తెలంగాణలో తానే ఇంజనీర్ అని కట్టిన డ్యాంలు కూలిపోతున్నాయి 
  • నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: తెలంగాణంలో కాంగ్రెస్ పార్టీ వస్తే గోర్లు మింగేటోడుపోయి బర్లు మింగేటోడు వచ్చినట్లు అవుతుందని నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ అన్నారు. జగిత్యాల బిజేపీ అభ్యర్థి డా. బోగ శ్రావణి నామినేషన్ సమర్పించిన తర్వాత జగిత్యాల పట్టణంలో నిర్వహించిన భారి ర్యాలిలో అరవింద్ పాల్గొని మాట్లాడుతూ తాను  అప్పుడు పసుపు బోర్డు కోసం బాండ్ పేపర్ రాసిచ్చా అని ఇప్పుడు బోగ శ్రావణిని  అసెంబ్లీలో కూర్చోబెడతా అని బాండ్ పేపర్ రాశిస్తున్ననని పేర్కొన్నారు. ఇల్లు, ఆరోగ్య బీమా, పిల్లలకు ఉద్యోగం,కొత్త పెన్షన్ రేషన్ కార్డులు ఇవ్వని బిఆర్ ఎస్ ను బొంద పెట్టాలని అన్నారు. నా 47 ఏళ్ల వయసంత రాజకీయ అనుభవం ఉన్న జీవన్ రెడ్డిని  సూటి ప్రశ్న అడుగుతున్నా ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ లో ఒక బీసీ అభ్యర్థ లేడు ..ఇదేనా మీ సామాజిక న్యాయం అని ప్రశ్నించారు. కొండా లక్ష్మణ్ బాపూజీ, మాణిక్  రావు, ముదిరాజు జగన్నాథరావుని, డి శ్రీనివాస్ ని మోసం చేసిన పార్టీ కాంగ్రెస్. బీసీలను గొంతు కోసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. 75 ఏళ్ల పాలనలో ఒక్క బీసీ ముఖ్యమంత్రి మీకు దొరకలేదా. ఇప్పటికి రేవంత్ రెడ్డి చంద్రబాబు చంచానే అని అన్నారు. పచ్చి మోస గత్తే గాంధీ సోనియాగాంధీ అని 2004 డి. శ్రీనివాస్ కు సియం పదవి ఇస్తానని మోసం చేసిందన్నారు. అమేథీలో  తంతే వాయినాడులో  పడ్డ రాహుల్ గాంధీ వచ్చి బిజెపికి రెండు శాతం ఓట్లు వస్తాయని పేర్కొంటాడా.. మోదీ కాళీ గోటి దుమ్ము కాడికి పనికిరాడు రాహుల్ గాంధీ అని అన్నారు.

కేటీఆర్ మమ్మల్ని మతపిచ్చిగాలంటున్నారని, దేశవ్యాప్తంగా నాలుగు కోట్ల ఇల్లు కట్టాం.. కట్టిన ఇళ్లలో లక్షల మంది ముస్లింలకు ఇల్లు ఇచ్చాం.. కోవిడ్ సమయంలో ఆరోగ్య భీమా ఆయుష్మాన్ భారత్ 22 మంది కోట్ల ప్రజలను ఆదుకుంది అందులో ముస్లింలు లేరా.. ఎవరు మత సిచ్చు పెడుతున్నారు అని ప్రశ్నిచారు. తెలంగాణ ప్రజలంతా మా కుటుంబ సభ్యులు... కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలకు వారు కేవలం ఓటర్లు మాత్రమే అని అన్నారు. దళిత బందు పెట్టి కెసిఆర్ ఒక్క శాతం దళిత కుటుంబాలకు కూడా ఇవ్వలేదు.. 10 లక్షలు దళితులకు ఇచ్చినప్పుడు ముస్లింలు, బిసిలు నీకు కంటికి కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ముస్లింలను బీసీలను కేవలం ఓటర్ల లాగానే చూస్తున్నారు. జగిత్యాలలో మొట్టమొదటి మహిళా ఎమ్మెల్యేగా శ్రావణి ఎన్నుకోండి అని కోరారు. తెలంగాణలో డ్యాములు ప్రాజెక్టులు కూలిపోతున్నాయి.. కెసిఆర్ కళ్ళు చెక్ చేయండి డాక్టర్ సంజయ్...నేనే ఇంజనీర్ అని  కెసిఆర్ డ్యాములు కట్టిన మూడేళ్లని కూల్పోతున్నాయి.. ఇదే నా బంగారు తెలంగాణ అని ప్రశ్నిచారు. జీవన్ రెడ్డి  మీ పార్టీ కథమైపోయింది మీరు కూడా రెస్ట్ తీసుకొని యువకులకు అవకాశం కల్పించండి.. ఎప్పుడు మీరేనా బీసీలకు, యువకులకు అవకాశం కల్పించార.. మా నాన్న మీరు ఒకటే కదా మా నాన్న రిటైర్డ్ అయ్యారు మీరు ఎప్పుడు రిటైర్ అవుతారు. మీకు గౌరవం ఇస్తా కానీ ఇది పద్ధతి కాదు సామాజిక న్యాయం కాదని అన్నారు.  రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతాడు ఆయనకు అర్థం కాదు.. ప్రపంచాని అర్థం కాదు.. దేశంలో పెద్ద జోకర్ ఆయన అని అన్నారు. జీవన్ రెడ్డికి జగిత్యాల గడ్డ చాలా ఆశీర్వాదం ఇచ్చింది. జగిత్యాలకు ఏం న్యాయం చేశారు. ఏ వర్గానికి ఏం న్యాయం చేశారు. 75 ఏళ్ల లో  ముస్లింలకు ఏం చేశారని ప్రశ్నిచారు. కేసీఆర్  బీసీలకు మైనారిటీలకు ఏమీ జవాబు చెప్తారని,  దళితులకు మూడు ఎకరాలు ఇస్తానన్నావు.. మూడు ఎకరాలు ఇస్తే 10 లక్షలు ఎవరు అడుగుతారని అన్నారు.