భువనగిరి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి కృషి చేస్తా -  భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి 

భువనగిరి గుట్ట ట్రెక్కింగ్ కార్యక్రమంలో ఎమ్మెల్యే తో పాటు పాల్గొన్న జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి, రాచకొండ పోలీస్ జాయింట్ సీపీ సత్యనారాయణ, డిసిపి రాజేష్ చంద్ర

ముద్ర ప్రతినిది, భువనగిరి: భువనగిరి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని భువనగిరి శాసనసభ్యులు పైళ్ళ శేఖర్ రెడ్డి అన్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా తెలంగాణ రన్ కార్యక్రమాన్ని రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరి ఆధ్వర్యంలో భువనగిరి కోట ట్రేక్కింగ్ ను ముఖ్యఅతిథిగా భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ పమేలా సత్పథి, రాచకొండ జాయింట్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ, డిప్యూటీ పోలీస్ కమిషనర్ రాజేష్ చంద్ర ట్రెక్కింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా 11వ రోజు తెలంగాణ రన్ కార్యక్రమాన్ని రాచకొండ పోలీసు కమిషనరేట్ ఆధ్వర్యంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన తెలంగాణలో ఏకశిల పర్వతమైన భువనగిరి కోటను ట్రెక్కింగ్ చేస్తూ 200 మీటర్ల జాతీయ జెండాను సుమారు 300 మందితో రాణి మహల్ వద్ద జాతీయ జెండాను ముఖ్యఅతిథి భువనగిరి ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి ఎగురవేశారు. 

పోలీస్ సిబ్బంది, క్రీడాకారులు, యువకులు, ప్రజలు అందరూ కలిసి 200 మీటర్ల జాతీయ జెండాను కోట చుట్టూ ప్రదర్శిస్తూ జాతీయ జెండాను ఎగరవేయడం జరిగింది.

అనంతరం తెలంగాణ రన్ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ భువనగిరి శాసనసభ్యలు పైళ్ళ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా తెలంగాణ రన్ కార్యక్రమంలో నేను స్వయంగా మొదటిసారి భువనగిరి కోటను ట్రెక్కింగ్ చేసి జెండా ఎగరవేయడం గొప్ప అనుభూతిని కలిగించిందని, భువనగిరి కోటను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసి మొదటి స్థానంలో నిలపడానికి కృషి చేస్తానని తెలిపారు.  

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడుతూ.. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ భువనగిరి జోన్, జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో భువనగిరి కోటపైన 200 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ కోటపైన జాతీయ జెండా ఎగరవేయడం అనేది గొప్ప విషయమని, తెలంగాణ రాష్ట్రంలో ఏకశిలా పర్వతంగా ఉన్నటువంటి భువనగిరి ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి పరచడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.

రాచకొండ కమిషనరేట్ జాయింట్ పోలీస్ కమిషనర్ సత్యనారాయణ మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్ భువననగిరి జోన్ ఆధ్వర్యంలో తెలంగాణ రన్ కార్యక్రమాన్ని అత్యంత ఘనంగా నిర్వహిస్తూ భువనగిరి కోట పైన 200 మీటర్ల జాతీయ జెండాను ప్రదర్శిస్తూ భువనగిరి ఖిల్లా పైన జాతీయ జెండాను యువకులు, క్రీడాకారులు, ప్రజలతో కలిసి ఎగరవేయడం అనేది చాలా సంతోషకరమైన విషయమని, ఫ్రెండ్లీ పోలీసులు ప్రజలకు దగ్గర చేస్తూ శాంతి భద్రతలను కాపాడడంలో తెలంగాణ రాష్ట్రం ముందుంటుందని అన్నారు.

అనంతరం తెలంగాణ రన్

కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు, జిల్లా తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ప్రదర్శనలు అలరించాయి.

కార్యక్రమంలో భువనగిరి మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, జిల్లా రైతు సమన్వయ సమితి కన్వీనర్ అమరేందర్, వైస్ చైర్మన్ చింతల కిష్టయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, జిల్లా యువజన క్రీడల అధికారి ధనాంజనేయలు, వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.